ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క.. సలార్, ప్రాజెక్ట్ కేలతో ప్రభాస్ రేంజ్ ప్రూవ్ కానుందా?
TeluguStop.com
స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి, బాహుబలి2 సినిమాలతో విజయాలను సొంతం చేసుకోగా ఆ తర్వాత ఈ స్టార్ హీరోకు అదృష్టం కలిసిరావడం లేదు.
ప్రభాస్ సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతున్నా ఆ రేంజ్ లో కలెక్షన్లు మాత్రం రావడం లేదు.
సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేక నిరాశపరిచాయి.సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలపైనే ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.
అయితే తర్వాత సినిమాలతో ప్రభాస్( Prabhas ) కచ్చితంగా సత్తా చాటుతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
సలార్, ప్రాజెక్ట్ కేలతో ప్రభాస్ రేంజ్ ప్రూవ్ కానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ రెండు సినిమాల బడ్జెట్ 1100 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమాలకు 2000 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది.
ప్రభాస్ గత సినిమాలకు డైరెక్టర్ల ఎంపిక విషయంలో పొరపాట్లు జరిగాయనే సంగతి తెలిసిందే.
"""/" /
అయితే తర్వాత ప్రాజెక్ట్ ల విషయంలో ఆ పొరపాట్లు జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.
ప్రభాస్ రెమ్యునరేషన్( Remuneration ) భారీ రేంజ్ లో ఉండగా ప్రభాస్ సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.
అందువల్ల నిర్మాతలు సైతం ప్రభాస్ డిమాండ్ కు అనుగుణంగా పారితోషికం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారని సమాచారం అందుతోంది.
"""/" /
సలార్ టీజర్( Salaar ) బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
సలార్ సినిమా సరికొత్త రికార్డులు సాధించి ప్రేక్షకులను మెప్పించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సలార్ మూవీకి యాక్షన్ సీక్వెన్స్ లు హైలెట్ గా నిలుస్తాయని సమాచారం.
సలార్ మూవీకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సరికొత్త రికార్డులు క్రియేట్ కావడానికి ఎంతో సమయం పట్టదు.
ప్రభాస్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా సినిమా సినిమాకు ప్రభాస్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.
అలా తోడుండే భాగస్వామి కావాలి.. హీరోయిన్ రష్మిక సంచలన వ్యాఖ్యలు వైరల్!