‘సలార్’ టీజర్ పై మేకర్స్ మరో క్రేజీ అప్డేట్.. భారీ ప్లానింగ్ చూసారుగా!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas ) లైనప్ లో నెక్స్ట్ రిలీజ్ కాబోతున్న పాన్ ఇండియన్ మూవీ ''సలార్''.

బాహుబలి తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ కూడా కొట్టక పోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.

వీరంతా ఇప్పుడు ఈ సినిమా మీదనే ఆశలు పెట్టుకున్నారు.అందులోను ఈ మూవీని కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Director Prashanth Neel ) తెరకెక్కిస్తుండడంతో ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

"""/" / నీల్ మీద నమ్మకంతో ఆయనైనా ప్రభాస్ కు అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఇస్తాడని నమ్ముతున్నారు.

మరి నీల్ అయిన ప్రభాస్ కు హిట్ ఇస్తాడో లేదో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ అదిరిపోగా రేపు టీజర్ రిలీజ్ కానుంది.జూన్ 6న ఉదయం 5 గంటల 12 నిముషాలకు రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

అయితే తాజాగా మరో పోస్ట్ ను చేసు క్రేజీ అప్డేట్ ఇచ్చారు.ఈ సలార్ టీజర్( Salaar Teaser ) ను మన ఇండియాలోనే కాకుండా మరో 14 దేశాల్లో రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు.

అంతేకాదు ఒక్కో దేశంలో ఈ టీజర్ టైం డిఫరెంట్ గా ఉండబోతుంది అని ఆ టైమింగ్స్ ఏంటి అనేది పోస్టర్ ద్వారా తెలుపుతూ క్రేజీ పోస్ట్ చేయగా టీజర్ కోసమే భారీ ప్లానింగ్స్ చేసిన నీల్ మూవీ రిలీజ్ కోసం ఇంకెన్ని ప్లాన్స్ రెడీ చేస్తున్నాడో అని ఫ్యాన్స్ ఆసక్తి మరింత పెరిగింది.

చూడాలి టీజర్ ఎలా ఆకట్టుకుంటుందో. """/" / కాగా ప్రభాస్ కెరీర్ లోనే మాస్ లుక్ ను డిజైన్ చేసిన నీల్ ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ మూవీగా తీర్చి దిద్దారు.

ఇక ఈ సినిమాలో శృతి హాసన్( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.

హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు రవి బసృర్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమా సెప్టెంబర్ 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.

పెదవులు చుట్టూ చర్మం నల్లగా కనిపిస్తుందా.. అయితే ఈ టిప్స్ గురించి తెలుసుకోండి!