‘సలార్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. డబ్బింగ్ స్టార్ట్ చేసిన టీమ్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో ''సలార్''( Salaar ) ఒకటి.

పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పై అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పార్ట్ 1 సీస్ ఫైర్ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

"""/" / ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేసి అంచనాలు అమాంతం పెంచేయగా ట్రైలర్( Salaar Trailer ) ఈ ఆగస్టులో రాబోతుంది అని అనౌన్స్ చేసారు.

దీంతో ఇప్పుడు అంతా కూడా ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు.అయితే ఈ లోపులోనే ఈ సినిమా నుండి మొదటి సింగిల్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఫస్ట్ సాంగ్ ను ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు టాక్.

ఇక తాజాగా అందుతున్న లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఒక్కో పని పూర్తి చేసుకుంటూ పోతున్నారు.

తాజాగా మేకర్స్ ఈ సినిమా యొక్క డబ్బింగ్( Salaar Dubbing ) పనులు కూడా స్టార్ట్ చేసారని తెలుస్తుంది.

మరి వచ్చే నెల సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా పలు భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అందరిని ఎలా ఆకట్టుకుందో వేచి చూడాలి.

"""/" / కాగా ఈ సినిమాలో శృతి హాసన్( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.

హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.ఆదిపురుష్( Adipurush ) వంటి ప్లాప్ తర్వాత ప్రభాస్ నుండి రాబోతున్న సినిమా ఇదే కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు.

చూడాలి ఈ సినిమా అయిన ప్రభాస్ కెరీర్ లో బాహుబలి రేంజ్ హిట్ అందుకుంటుందో లేదో.