‘సలార్’ షూట్ పై లేటెస్ట్ క్రేజీ అప్డేట్.. ఇక ఇంతే మిగిలి ఉందట!

పాన్ ఇండియా స్టార్ గా మెప్పిస్తున్న స్టార్ హీరోల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) ఒకరు.

ఈయన బాహుబలి ( Baahubali ) సిరీస్ తో ఒక్కసారిగా పాపులర్ అయ్యి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.

ఇంతటి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న తర్వాత ప్రభాస్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు.

దీంతో ఈయనతో సినిమాలు చేసేందుకు పాన్ ఇండియన్ వ్యాప్తంగా ఉన్న డైరెక్టర్లు పోటీ పడ్డారు.

"""/"/ మరి ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో 'సలార్'( Salaar ) ఒకటి.

ఈ సినిమాను కెజిఎఫ్ ( KGF ) డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

మిగతా సినిమాల కంటే ఈ సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్ ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు.

ఎందుకంటే కెజిఎఫ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న నీల్ తర్వాత చేస్తున్న సినిమా ఇదే కావడంతో ఈ సినిమా కూడా పక్కా బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

ఈ సినిమా కేజిఎఫ్ కు మించి ఎన్నో రెట్లు యాక్షన్ ఎలిమెంట్స్ తో పవర్ ఫుల్ గా నీల్ తెరకెక్కిస్తున్నాడు.

ప్రెజెంట్ ఫుల్ స్వింగ్ లో మేకర్స్ షూట్ ను కొనసాగిస్తున్నారు.ఫారిన్ కంట్రీస్ లో కీలక షెడ్యూల్ జరుపు కుంటున్న ఈ సినిమా షూట్ పై తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుస్తుంది.

ఈ సినిమాకు 15 నుండి 20 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట.

"""/"/ ఈ 20 రోజుల షూటింగ్ పూర్తి అయితే ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయినట్టే అని ఇక తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి అనుకున్న సమయానికే ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

ఇక జులై లేదా ఆగష్టు నుండి వరుస అప్డేట్ లను ఇవ్వడానికి మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.

కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.

హోంబలే ( Hombale Films ) వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.

సెప్టెంబర్ 28న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

అధ్యక్ష ఎన్నికల వేళ కలకలం.. కోవిడ్ బారినపడ్డ జో బైడెన్ , అర్ధాంతరంగా సభ నుంచి ఇంటికి