సలార్ మూవీ ప్లస్ పాయింట్లు ఇవే.. ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకున్న బ్లాక్ బస్టర్ సినిమా ఇదేనంటూ?

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ మూవీ( Salaar ) థియేటర్లలో విడుదలైంది.

అభిమానులు ప్రభాస్ ను( Prabhas ) ఏ విధంగా చూడాలని అనుకున్నారో ఈ సినిమాలో అదే విధంగా ప్రశాంత్ నీల్( Prashanth Neel ) చూపించారు.

సినిమాలో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.కథనంలో కొన్ని చిన్నచిన్న మైనస్ లు ఉన్నా ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా ఫుల్ మీల్స్ అనే చెప్పాలి.

ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేస్తాయి.ప్రభాస్ లుక్స్ సలార్ కు హైలెట్ గా నిలవగా ప్రభాస్ నట విశ్వరూపం సలార్ అని చెప్పవచ్చు.

ప్రశాంత్ నీల్ సింపుల్ కథను తన స్టైల్ లో చెప్పి అభిమానులను ఆకట్టుకున్నారు.

మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా మాస్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల దగ్గర హడావిడి మామూలుగా లేవు.సలార్ ఫస్ట్ డే కలెక్షన్లతోనే సంచలనాలు సృష్టిస్తోంది.

"""/" / ట్రైలర్ కు భిన్నంగా ఫస్టాఫ్ ఉండగా శృతి హాసన్( Shruti Haasan ) పాత్రకు తగిన ప్రాధాన్యత ఉంది.

బాహుబలి రికార్డులను బ్రేక్ చేసే మూవీ సలార్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.2023 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సలార్ కాగా కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలకు మించి హీరో ఎలివేషన్స్ ఉన్నాయి.

మరికొన్ని రోజుల పాటు సలార్ ఫీవర్ కొనసాగే ఛాన్స్ అయితే ఉంది.సినిమాలో సలార్ ఊచకోత మామూలుగా లేదు.

"""/" / సలార్ ఫస్ట్ హాఫ్ హైదరాబాద్ బిర్యానీ కాగా సెకండాఫ్ మంచి నవాబ్ మండీ అని ఫ్యన్స్ కామెంట్లు ఇస్తున్నారు.

కొంతమంది ప్రభాస్ అభిమానులు ఈ సినిమా 4 స్టార్ రేటింగ్ ఇస్తున్నారు.ప్రభాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

కొన్ని చిన్నచిన్న నెగిటివ్ పాయింట్లు ఉన్నా సలార్ పై ఏర్పడ్డ అంచనాలు, సలార్ తీసిన విధానంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి.

మన వాళ్ళకే నేషనల్ అవార్డ్ కానీ మనకు కాదు… ఇదేం దరిద్రం రా బాబు