‘సలార్’లో ప్రభాస్ పై వాయిస్ ఓవర్.. ఎవరు చెబుతారో తెలుసా?
TeluguStop.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ''సలార్( Salaar )'' ఒకటి.
ఈ సినిమా గురించి నెట్టింట రోజుకొక వార్త వైరల్ అవుతూనే ఉంది.ఈ వార్తలన్నీ ఈ సినిమాపై మరింత క్రేజ్ పెంచేయడానికి దోహదం చేస్తున్నాయి.
ఈ సినిమా మరో రెండు నెలల్లో రిలీజ్ కాబోతుంది.రిలీజ్ దగ్గరికి రాబోతున్న కొద్దీ అంచనాలు పీక్స్ కు చేరుకుంటున్నాయి.
మేకర్స్ కూడా వరుస ప్రమోషన్స్ చేయడానికి సిద్ధం అయ్యారు.ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా టాలీవుడ్ చరిత్రలోనే కొత్త రికార్డులను నెలకొల్పింది.
ఇక ఆ తర్వాత ఫస్ట్ సింగిల్, ట్రైలర్ వంటివి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ట్రైలర్ ఆగస్టులో అని ముందే ప్రకటించారు.ఆ ట్రైలర్ కోసం ఎదురు చూస్తుండగానే మరిన్ని ఎగ్జైటింగ్ న్యూస్ లు వైరల్ అవుతున్నాయి.
"""/" /
తాజాగా ఈ సినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.
ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్( Prabhas ) గురించి ప్రత్యేకమైన వాయిస్ ఓవర్ నీల్ చెప్పించాడని తెలుస్తుంది.
ఈ వాయిస్ ఓవర్ సినిమాపై మరింత బలమైన ఇంపాక్ట్ చూపిస్తుందని.అలాగే ఫ్యాన్స్ కు కూడా కిక్ ఇస్తుందని టాక్.
అలాగే వాయిస్ ఓవర్ చెప్పే డైలాగ్స్ కు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు.
"""/" /
ఇంతకీ ఈ వాయిస్ ఓవర్ ను ఎవరితో చెప్పించ బోతున్నారు అంటే.
శుభలేఖ సుధాకర్( Subhalekha Sudhaka ) తో చెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
దీంతో ఈ వార్త మరింత ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తుంది.కాగా ఈ సినిమాలో శృతి హాసన్హీరోయిన్ గా నటిస్తుండగా.
హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.
పక్షికి సీపీఆర్ చేసి బతికించిన కేరళ వ్యక్తి.. నెటిజన్లు ఫిదా..