నైజాంలో సలార్ చూడాలంటే రూ.400 ఖర్చు చేయాలా.. ప్రభాస్ సినిమాకు ఇంత భారీ రేట్లా?
TeluguStop.com
ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వంలో టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం సలార్.
ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.సినిమా విడుదల తేదికి మరొక తొమ్మిది రోజులు మాత్రమే సమయము ఉంది.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంజనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలను మాత్రం చిత్ర బృందం మొదలు పెట్టకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
"""/" /
ప్రమోషన్స్ విషయంలో నమ్మకం లేదంటున్నారు ప్రభాస్ అభిమానులు.అయితే మరోపక్క టీమ్ మాత్రం ఆర్ఆర్ఆర్( RRR ) తో సమానంగా టిక్కెట్ల పెంపు కోసం ప్రయత్నాలు చేస్తోంది.
ఇప్పటికే నైజాంలో హైక్ మరియు స్పెషల్ షోల కోసం టీమ్ దరఖాస్తు చేసుకుంది.
ఈ సలార్ సినిమాకి వర్తించే ధరలు కూడా RRRకు దగ్గరగా ఉంటాయని అంటున్నారు.
ఇక ఆ లెక్కల ప్రకారం మల్టీప్లెక్స్‌లకు జీఎస్‌టీతో కలిపి రూ.413, సింగిల్ స్క్రీన్‌లకు జీఎస్టీతో కలిపి రూ.
236 టికెట్ ధరలు పెంచనున్నారు.ఈ పెంపు 1వ వారాంతం వరకు వర్తిస్తుంది.
వారాంతం తర్వాత వచ్చే వారంలో జిఎస్‌టితో సహా టిక్కెట్ ధరలు మల్టీప్లెక్స్‌లకు రూ.
354 మరియు సింగిల్ స్క్రీన్‌లకు రూ.230గా ఉండేలా చూసుకుంటున్నారు.
"""/" /
ఇది కొత్త ప్రభుత్వానికి అభ్యర్థించిన మొదటి పెంపు అనుమతి.ఇక ప్రభుత్వం నుంచి మేకర్స్ గ్రీన్ సిగ్నల్ అందుకుంటారో లేదో వేచి చూడాలి.
ప్రస్తుతానికి, ప్రభుత్వం ఆమోదించిన ధరలు మల్టీప్లెక్స్‌లకు రూ.295 మరియు సింగిల్ స్క్రీన్‌లకు రూ.
175 గా ఉన్నాయి.కాగా ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది.ఇక డిసెంబర్ 22 న మొదటి భాగం విడుదల కానుంది.
డిసెంబర్ 22 కోసం ప్రభాస్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.
మరి భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.
వెంకటేష్ మళ్ళీ ఫ్యామిలీ జానర్ లోనే సినిమాలు చేయాబోతున్నాడా..?