ఓటిటీ ప్లాట్ ఫామ్ ను లాక్ చేసుకున్న ‘సలార్’!

ఎన్నో రోజుల డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురు చూపులకు కొద్దీ గంటల క్రితమే తెరపడింది.

పాన్ ఇండియన్ వ్యాప్తంగా మోస్ట్ ఏవైటెడ్ మూవీగా ఉన్న ''సలార్'' ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

ఈ సినిమాకు రిలీజ్ అయ్యిన అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తుంది.బాహుబలి వంటి హిట్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ మరో సినిమాతో హిట్ అందుకోలేక పోయారు.

ప్రభాస్ నుండి ఎన్నో సినిమాలు వచ్చిన కూడా అన్ని ప్లాప్ అయ్యాయనే చెప్పాలి.

మరి దాదాపు ఆరేళ్ళ ఫ్యాన్స్ నిరీక్షణ తర్వాత ప్రభాస్ కు హిట్ అనేది పడింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ''సలార్''( Salaar ).

"""/" / క్రిస్మస్ కానుకగా ఈ రోజు ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చింది.

ఈ సినిమా రిలీజ్ అవ్వగానే ఆడియెన్స్ నుండి వస్తున్న కామెంట్స్ చూస్తుంటే బిగ్గెస్ట్ హిట్ అయ్యే అవకాశం ఉంది.

ప్రభాస్ నుండి మరో మోస్ట్ హైప్ తో వచ్చిన ఈ సినిమాతో ఎట్టకేలకు డార్లింగ్ ఖాతాలో చాలా ఏళ్ల తర్వాత హిట్ అనేది పడింది.

"""/" / ఇదిలా ఉండగా ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ గురించి ఇప్పుడు ఒక సమాచారం బయటకు వచ్చింది.

ఈ సినిమా ఓటిటి హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్( Netflix ) వారు సొంతం చేసుకున్నట్టు సమాచారం.

సలార్ థియేటర్స్ రన్ పూర్తి అవ్వగానే ఓటిటిలో ఈ మూవీ సందడి చేయనుంది.

కాగా ఈ సినిమాలో శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటించగా.

హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మించారు.అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ పోషించారు.

ఒక సినిమా సక్సెస్ లో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది…