ఈ ఏడాది బిగ్గెస్ట్ గ్రాసర్ గా సలార్.. ఫస్ట్ డే ఎంత రాబట్టిందంటే?

డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురు చూపులకు నిన్నటితో తెరపడింది.ఆదిపురుష్ వంటి ప్లాప్ తర్వాత మళ్ళీ ప్రభాస్ నుండి మరో సినిమా రిలీజ్ అయ్యింది.

పాన్ ఇండియన్ వ్యాప్తంగా మోస్ట్ ఏవైటెడ్ మూవీగా ఉన్న ''సలార్''( Salaar ) నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ ఆనందం అంత ఇంత కాదు.

బాహుబలి వంటి హిట్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ మరో సినిమాతో హిట్ అందుకోలేక పోయారు.

ఎన్నో సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఫలితం ఒకేలా వచ్చింది.మరి దాదాపు ఆరేళ్ళ ఫ్యాన్స్ నిరీక్షణ తర్వాత ప్రభాస్ కు హిట్ అనేది పడింది.

దీంతో తమ హీరో కంటే ఫ్యాన్స్ నే ఎక్కువ హంగామా చేస్తూ ఈ హిట్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

"""/" / యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ''సలార్''( Salaar ).

ఈ సినిమాపై రిలీజ్ కు ముందు నుండే భారీ హోప్స్ ఉండగా రిలీజ్ తర్వాత కూడా ఈ అంచనాలను నీల్ ఏ మాత్రం బ్రేక్ కాకుండా చూసుకున్నాడు.

క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చింది.కాగా ఈ సినిమా మొదటి రోజు కోసం పాన్ వరల్డ్ వైడ్ గా భారీ అడ్వాన్స్ బుకింగ్స్జరిగాయి.

మాసివ్ బుకింగ్స్ తో ఈ సినిమా మాసివ్ రికార్డులను కొల్లగొట్టినట్టే అనిపిస్తుంది.మరి ట్రేడ్ పండితులు వేస్తున్న అంచనాల ప్రకారం ఈ సినిమా మొదటి రోజు 165 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు అంచనా.

"""/" / ఈ ఏడాది ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు రాగా వాటికీ కూడా బాగానే ఓపెనింగ్స్ వచ్చాయి.

లియో, జవాన్ లాంటి సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.మరి ఈ సినిమాల ఓపెనింగ్స్ లను కూడా క్రాస్ చేస్తూ సలార్ ఏకంగా 165 కోట్ల ఓపెనింగ్స్ కొల్లగొట్టినట్టు తెలుస్తుంది.

మరి ఇది ఈ ఏడాదికి హైయెస్ట్ గ్రాసర్ అనే చెప్పాలి.మొత్తానికి సలారోడి దెబ్బకు బాక్సాఫీస్ అల్లాడిపోతుందనే చెప్పాలి.

Skill Vs Luck: Data Analytics, Player Strategy, And The Reality Behind Bluff Bet Casino For Canadian Crypto Users