పవన్ ‘ఓజి’పై సలార్ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అలా ఉంటుందంటూ..

పాన్ ఇండియన్ వ్యాప్తంగా మోస్ట్ ఏవైటెడ్ మూవీగా ఉన్న ''సలార్'' డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

దీంతో ఈ నెల మొత్తం సలార్ మేనియా నడుస్తుంది.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ''సలార్''( Salaar ).

ఈ సినిమాతో ఎట్టకేలకు డార్లింగ్ ఖాతాలో అయితే హిట్ పడింది.మరి ఈ సినిమాలో కీలక రోల్ లో శ్రీయ రెడ్డి నటించిన విషయం తెలిసిందే.

ఈ భామ ఈ సినిమాలో రాధా రమ మన్నార్ పాత్రతో ఆడియెన్స్ ను తన వైపు తిప్పుకుంది.

ఇక ఈ పాత్రను ఆడియెన్స్ బాగా ఆదరిస్తున్నారని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. """/" / అంతేకాదు ఈ ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ''ఓజి'' ( OG Movie ) సినిమాలో తన రోల్ ఎలా ఉండబోతుందో చెప్పి మరింత క్యూరియాసిటీ పెంచేసింది.

ఈ సినిమాలో ఈ భామ తన రోల్ సినిమాకు కీలకం అని అయితే ఇది నెగిటివ్ రోల్ కాదని ఈ రోల్ కూడా ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పుకొచ్చింది.

"""/" / అలాగే ఈ సినిమా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆడియెన్స్ అంత ఈ సినిమాను మెచ్చేలా డైరెక్టర్ సుజీత్( Director Sujeeth ) అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని ఇక పవర్ స్టార్ నటన అదిరిపోతోందని ఓజి టీమ్ తో పని చేయడం ఎంతో సంతోషంగా ఉందంటూ ఈమె చెప్పుకొచ్చింది.

ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కాగా ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారుకాగా మాసివ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

బాలయ్య బోయపాటి మూవీలో స్టార్ హీరోయిన్ కూతురు.. ఆ పాత్రలో కనిపిస్తారా?