ష‌ర్మిల‌ను లైట్ తీస్కొన్న సాక్షి… కొత్త ఛానెల్ రెఢీ ?

ష‌ర్మిల‌ను లైట్ తీస్కొన్న సాక్షి… కొత్త ఛానెల్ రెఢీ ?

తెలంగాణ రాజ‌కీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌డంతో పాటు కొత్త పార్టీ ఏర్పాటుపై వైఎస్‌.

ష‌ర్మిల‌ను లైట్ తీస్కొన్న సాక్షి… కొత్త ఛానెల్ రెఢీ ?

ష‌ర్మిల దాదాపు సంకేతాలు ఇచ్చేస్తున్నారు.నిన్న ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన పార్టీ నేత‌ల‌తో ఆమె స‌మావేశం అవ్వ‌డంతో పాటు వారి అభిప్రాయాలు తీసుకున్నారు.

ష‌ర్మిల‌ను లైట్ తీస్కొన్న సాక్షి… కొత్త ఛానెల్ రెఢీ ?

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోద‌రిగా ఉన్న ష‌ర్మిల కొత్త పార్టీ పెడుతుండ‌డంతో నిన్న మీడియా అటెన్ష‌న్ అంతా ఆమె వైపే ఉంది.

ఓ వైపు ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల తొలి ద‌శ పోలింగ్ జ‌రుగుతున్నా కూడా అంద‌రి దృష్టి కూడా ష‌ర్మిల పార్టీ మీదే ఉంది.

మీడియా అంతా ష‌ర్మిల కొత్త పార్టీ స‌న్నాహ‌క స‌మావేశాన్నే హైలెట్ చేసింది.ఒక్క సాక్షి మీడియా మాత్రం ష‌ర్మిల‌కు ఏ మాత్రం క‌వ‌రేజ్ ఇవ్వ‌లేదు.

ఇక గ‌తంలో ష‌ర్మిల జ‌గ‌న్ కోసం, వైసీపీ కోసం పాద‌యాత్ర చేసిన‌ప్పుడు ఇదే సాక్షి మీడియా ఆమెకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టింది.

ఆ త‌ర్వాత ఆమెను పూర్తిగా మ‌ర‌చిపోయింది.జ‌గ‌న్ సీఎం అయ్యాక ఆమెకు పార్టీలోనూ.

సాక్షి మీడియాలోనూ క్ర‌మ‌క్ర‌మంగా ప్రాధాన్య‌త త‌గ్గుతూ వ‌చ్చింది.వైసీపీ అధిష్టానం నుంచి వ‌చ్చిన ఆదేశాల మేర‌కే ఆమెను సాక్షి మీడియా ఆమెను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది.

"""/"/ ఈ క్ర‌మంలోనే ఆమె త‌న వాయిస్ కోస‌మే మీడియారంగంలోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో పాటు ఓ కొత్త ఛానెల్ కూడా పెడుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ ఛానెల్ వెన‌క టీవీ 9 మాజీ సీఈవో కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని తాజాగా వెలుగు చూసింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ష‌ర్మిల వాయిస్ బ‌లంగా వినిపించే క్ర‌మంతో పాటు అటు సువార్త ప్ర‌సంగీకుడు బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్‌ను హైలెట్ చేసేలా ఈ ఛానెల్ కీల‌కంగా ఉండ‌బోతోంద‌ని స‌మాచారం.