టీడీపీ కార్యాలయాలపై దాడులకు సజ్జలే కారణం.. దేవినేని
TeluguStop.com
ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది.రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలపై దాడులకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డినే కారణమని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు.
చంద్రబాబుపై దాడి చేసిన వారికి మంత్రి పదవి ఇచ్చారని దేవినేని విమర్శించారు.ఆనం వెంకటరమణపై సజ్జల దాడి చేయించారని ఆరోపణలు చేశారు.
దాడి జరిగి 24 గంటలు గడిచినా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని మండిపడ్డారు.ఆనంపై దాడి జరిగితే మంత్రి కాకాణికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో దాడిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Tipsport Zahlungen Und Kontozugang Für Spieler In DE