ఏపీ విభజనపై సజ్జల సంచలన వ్యాఖ్యలు
TeluguStop.com
ఏపీ ఉమ్మడిగా ఉండాలన్నదే వైసీపీ విధానమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
మళ్లీ ఉమ్మడి ఏపీ కాగలిగితే తొలుత స్వాగతించేది వైసీపీనేనని తెలిపారు.రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తాము ముందు నుంచి పోరాడుతున్నామని చెప్పారు.
అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ విభజనకు అనుకూలంగా వ్యవహరించాయని తెలిపారు.రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైసీపీ పోరాటం చేస్తోందన్నారు.
ఉండవల్లి పనిగట్టుకుని జగన్ నే టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.ఈ క్రమంలో విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో తమ వాదనలు వినిపిస్తామని సజ్జల స్పష్టం చేశారు.