పవన్ పై సజ్జల రామకృష్ణారెడ్డి సీరియస్ కామెంట్స్..

సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం అంటున్న పవన్ ఏ ఆధారాలతో అంటున్నాడు.గెస్ట్ ఆర్టిస్ట్ లా వచ్చి చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్తాడు.

సబ్ ప్లాన్ కంటే ఎక్కువగా నిధులు అందిస్తున్నాం.చంద్రబాబు ఐదేళ్లలో 33 వేలు కర్చు చేశారు.

జగన్ మూడేళ్లలో 48 వేల కోట్లు నిధులు ఇచ్చారు.కేవలం Dbt ద్వారానే 30 వేల కోట్లు Sc St లకు ఇచ్చాం.

పొలిటికల్ గా, పదవులు పరంగా Sc St లకు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

సకల శాఖల మంత్రి అని పవన్ నాపై విష ప్రచారం చేస్తున్నారు.టార్గెట్ గా చేసుకుని ప్రజల్లో ఏదో క్రియేట్ చెయ్యడానికి ఇలా చేస్తున్నారు.

పొత్తుల గురించి పవన్ చెప్పిన మూడు ఆప్షన్స్ నవ్వొస్తుంది.ఏమీ లేకుండా చంద్రబాబుకి సపోర్టు చెయ్యడం అనే నాలుగో ఆప్షన్ కూడా చెప్పాల్సింది.

గత రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా పవన్ రిమోట్ చంద్రబాబు చేతుల్లోనే ఉంటుంది.

లోకేష్ పాదయాత్ర ను టిడిపి ఎక్కువగా ఊహించుకుంటుంది.జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఉన్న నిబంధనలే ఇప్పుడు ఉన్నాయి.

జగన్ ఆంక్షలకు లోబడే పాదయాత్ర చేశారు.ఆంక్షలు పెట్టారని గగ్గోలు పెట్టలేదు.

కందుకూరు ఘటనతో రోడ్లపై సభలు నిషేధం నిర్ణయం తీసుకున్నాం.లోకేష్, పవన్, చంద్రబాబు లలో సీఎం అభ్యర్థి ఎవరో ప్రజలకు చెప్పండి.

వైసీపీ అంటే జగన్.జగన్ అంటే వైసీపీ మేము స్పష్టంగా ఉన్నాం.

మీరెందుకు స్పష్టంగా చెప్పలేక పోతున్నారు.?విడివిడిగా వచ్చినా.

కలిసి వచ్చినా మాకు ఒకే.అవినాష్ రెడ్డికి నోటీస్ లు పొలిటికల్ అజెండా.

బీజేపీలో ఉన్న టిడిపి స్లీపర్ సెల్స్ చేస్తున్న అజెండా.అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరవుతారు.