సజ్జల ఎక్కడున్నాడబ్బా.. ? ఇప్పుడిదే చర్చ ?
TeluguStop.com
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.ఎందుకంటే తన రాజకీయాలు, వ్యవహార తీరుతో తరచూ మీడియాలో ఆయన పేరు వినిపిస్తుండడం కారణంగా చెప్పుకోవచ్చు.
సీఎం జగన్ మనసులో ఏముందో ? అది సజ్జల నోట్లో నుంచి వస్తుందని టాక్.
ఒకవిధంగా చెప్పాలంటే సీఎం జగన్‌కు ఆయన అధికార ప్రతినిధిగా చెప్పుకోవచ్చు.వైసీపీలో ఆయన సకల శాఖల మంత్రిగా పేరుగడించినట్టు విపక్షాలు, ప్రత్యర్థులు చెబుతుంటారు.
ఇలాంటి సజ్జల కొంతకాలంగా సైలెంట్ అయ్యాడా ? అనే టాక్ వస్తోంది.అయితే ఏపీలో ఇటీవలి కాలంలో అనేక సంఘటనలు జరిగాయి.
కానీ, సజ్జల మాత్రం మీడియా వేదికగా పెద్దగా అలికిడి చేయట్లేదు.ఈఎల 12న పార్టీ ఆవిర్భావ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొన్నారు.
అనంతరం ఆయన సందడి ఎక్కడా కనిపించలేదు.అసెంబ్లీ సెషన్ హోరులో సజ్జల ఊసు విస్మరించినా ఇప్పడు గుర్తుచేసుకుంటున్నారట.
ఇంతకు ఆయన ఎక్కడ ఉన్నారబ్బా.అంటూ ఆరా తీస్తున్నారట.
మొత్తంగా సజ్జల ఖాళీగా అయితే లేరని తెలుస్తోంది.మరోవైపు ఏపీలో వైసీపీ మంత్రి వర్గ విస్తరణ జరగబోతోంది.
ఈ సారి ఇది ఎన్నికలతోకూడుకున్నది.దీంతో అనేక సమాజిక వర్గ సమీకరణాలు చూడాలి.
ఎన్నో కూర్పులు, మార్పులు చేయాలి. """/"/ వైసీపీ హైకమాండ్ కూడా మంత్రి వర్గానికి సంబంధించిన ఆశావహుల జాబితాను దగ్గరు ఉంచుకోవాలి.
ఇందుకు సంబంధించి షార్ట్ లిస్ట్ చేసే కీలక బాధ్యతలను సజ్జలకు అప్పగించారని సమాచారం.
దీంతో ఆయన ఆ లెక్క తేల్చే పనిలో పడ్డారని వినికిడి.మొత్తంగా వైసీపీ అధినాయకత్వానికి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ కొత్త మంత్రుల జాబితా తయారీలో సహాయం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కానీ, భవిష్యత్‌లో పదవులు ఆశించిన వారికి పదవులు రాకుంటే సజ్జలపై విమర్శల బాణాలు ఎక్కుపెడతారా ? లేదా అన్నది వేచి చూడాలి.
ఆ విషయంలో తండ్రిని మించి వ్యక్తి రామ్ చరణ్.. మల్లేశ్వర్రావు కీలక వ్యాఖ్యలు