పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కౌంటర్లు వేసిన సజ్జల రామకృష్ణారెడ్డి..!!

ఇటీవల తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఏప్రిల్ 3 వ తారీఖున జరిగిన ఈ సభలో వైసిపి ఎమ్మెల్యేలను ఉద్దేశించి గూండాలు రౌడీలు అంటూ పవన్ కళ్యాణ్ కాంట్రవర్సీ కామెంట్ చేశారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయి అని, అదుపులో లేవని మండిపడ్డారు.ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారుడు వైసిపి పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్లు వేశారు.

పవన్ కళ్యాణ్ కి సొంత అభిప్రాయమంటూ ఏదీ లేదని మండిపడ్డారు.రాత్రి ఒక పార్టీతో పగలు మరొక పార్టీతో చెట్టాపట్టాలేసుకుని రాజకీయాలు చేసే నేత పవన్ కళ్యాణ్ అన్నట్టు కౌంటర్ కామెంట్ చేశారు.

2019 కి ముందు ఒక లాగా తరువాత మరొక లాగా ఎక్కడా కూడా నిలకడలేని తత్వం అతనిది అని మండిపడ్డారు.

సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాబట్టి ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తే అది చదవటం తప్ప, పవన్ కళ్యాణ్ కి అంటూ ఒక అవగాహన లేదు అనే తరహాలో సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు తోడు దొంగలే..: మోదీ