చంద్రబాబు నైజం ప్రజలకు తెలుసు..: సజ్జల
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చంద్రబాబు( Chandrababu ) నైజం ప్రజలకు బాగా అర్థం అయిందని చెప్పారు.వాలంటీర్లపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఎవరూ మర్చిపోలేదన్నారు.
ఎన్నికలు కాబట్టే వాలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామని చంద్రబాబు మాట మార్చారని మండిపడ్డారు.
చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్ల స్థానంలో జన్మభూమి కమిటీ సభ్యులను( Janmabhoomi Committee Members ) తీసుకొస్తారని పేర్కొన్నారు.
వాలంటీర్ వ్యవస్థను తీసివేస్తామని చంద్రబాబు గతంలో అన్నారన్న సజ్జల ఇప్పుడు వాలంటీర్లను కొనసాగించి రూ.
10 వేలు ఇస్తామని మాట మార్చారని విమర్శించారు.ఎన్నికల్లో తీర్పు ఏకపక్షంగా వస్తుందన్నారు.
టీడీపీ వాళ్లే గొడవలు చేసి తమపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు.
నా కాపురంలో హన్సిక చిచ్చు పెట్టింది.. నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!