ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టంపై సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ..!!
TeluguStop.com
ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో విపక్షాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్( Land Titling Act ) చట్టం విషయంలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.
దీంతో తాజాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) క్లారిటీ ఇచ్చారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు దుష్ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు.ఈ చట్టం ఇంకా రూపకల్పన దశలోనే ఉంది.
ఇంకా గెజిట్ కాలేదు, విధీ విధానాలు ఖరారు కాలేదు.అక్రమాలకు చెక్ పెట్టే విధంగా ఈ యాక్ట్ ఉంటుంది.
సమగ్ర భూసర్వే పూర్తయిన తర్వాతే.అమల్లోకి వస్తోంది.
"""/" /
భూ కబ్జాలు చేసే చంద్రబాబు( Chandrababu ) లాంటి వాళ్లకు ఇలాంటి చట్టాలు రావటం ఇష్టం ఉండదు.
అని సీరియస్ అయ్యారు.అంతేకాదు "నువ్వు ఎలాగో ఎలాంటి చట్టాలు తీసుకురాలేవు.
ఎవరైనా తీసుకొస్తే నువ్వు సంతోషించవు.నీ విషపూరితమైన ఆలోచనలతో.
నీకున్న పచ్చ మీడియా బలంతో ఇలాంటి ప్రచారాలు చేయగలిగిన శక్తుల అండతో దీన్ని ల్యాండ్ గ్రాబింగ్ అని దుష్ప్రచారం సాగిస్తున్నావు" అంటూ చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.
ఇది భూములను రక్షించే చట్టం అని స్పష్టం చేశారు.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.
ఈ రకంగా మాట్లాడవచ్చా అని ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై చేస్తున్న విమర్శలను సజ్జల ఖండించారు.
వామ్మో, అమ్మాయిలు ఇంత డేంజర్‌గా ఉంటారా.. ప్రియుడికి విషమిచ్చిన ఇంజనీరింగ్ స్టూడెంట్.. చివరకు..?