ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందినా, ఆ పార్టీ అధినేత జగన్ లో మాత్రం ఏమాత్రం ఆందోళన కనిపించడం లేదు.
మళ్లీ కచ్చితంగా అధికారంలోకి వస్తామనే నమ్మకంతో జగన్ ఉన్నారు.ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను టార్గెట్ చేసుకుని ఏపీ ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేయడం , వైసిపి కీలక నాయకులను తమ పార్టీలో చేర్చుకునే వ్యూహాలను టీడీపీ , జనసేన అమలు చేస్తుండడం తో వైసిపి చాలా వరకు బలహీన పడింది.
ఈ వ్యవహారాలతో వైసిపి శ్రేణులు తీవ్ర భయాందోళనల్లో ఉన్న నేపథ్యంలో పార్టీకి తిరిగి పునర్ వైభవం తీసుకువచ్చేందుకు, పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
దీనిలో భాగంగానే పలు నియోజకవర్గాలకు కొత్త ఇన్చార్జీలను నియమించారు.దీంతోపాటు రీజనల్ కోఆర్డినేటర్ల నియామకాలను చేపట్టారు.
ఎన్నికలకు ముందు ఈ హోదాలో పనిచేసన వారిలో చాలామందిని కొనసాగించినప్పటికీ వారి రీజియన్లను మార్చారు .
తాజాగా రాష్ట్రస్థాయి కోఆర్డినేటర్లను జగన్ నియమించారు జగన్(Jagan) కు అత్యంత సన్నిహితుడు, వైసిపి(YCP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) కి ఆ పదవిని జగన్ కట్టబెట్టారు.
ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.జగన్ ఆదేశాల మేరకు సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియమించినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం రీజనల్ కోఆర్డినేటర్లను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవడం, ఆయా ప్రాంతాల నుంచి వచ్చే నివేదికలను తెప్పించుకోవడం, వాటిని విశ్లేషించడం వంటి బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డి చూడనున్నారు.
2027 లో జమిలి ఎన్నికలు రానున్న నేపద్యంలో ఇప్పటి నుంచే జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు.
"""/" /
ఇంతవరకు బాగానే ఉన్నా. సజ్జల విషయంలో జగన్ తప్పు చేస్తున్నారా అనే అభిప్రాయాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నాయి.
అసలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చెందడానికి సజ్జలే కారణమని, జగన్ ను తప్పుదోవ పట్టించి పార్టీ ఘోర పరాజయానికి సజ్జల రామకృష్ణ రెడ్డి కారణం అయ్యారని , మళ్ళీ ఇప్పుడు ఆయనకే జగన్ (Jagan) ప్రాధాన్యం ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతున్నాయి.
చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా పాన్ ఇండియాలో సక్సెస్ అవుతుందా..?