రెహమాన్ కు దూరంగా ఉండటానికి కారణాలివే.. సైరా భాను కామెంట్స్ వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో ఏఆర్ రెహమాన్( AR Rahman ) ఒకరు కాగా ఏఆర్ రెహమాన్ తాజాగా విడాకుల( Divorce ) గురించి ప్రకటించి షాకిచ్చిన సంగతి తెలిసిందే.
ఏఆర్ రెహమాన్ చేసిన ప్రకటన ఆయన అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది.పెళ్లైన ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన విడాకులు తీసుకోవడం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అయితే విడాకుల గురించి అతని భార్య సైరా భాను( Saira Bhanu ) తాజాగా స్పందించారు.
ఏఆర్ రెహమాన్ చాలా మంచి వ్యక్తి అని ఆమె పేర్కొన్నారు.ఏఆర్ రెహమాన్ గురించి తెలియకుండా తప్పుగా ప్రచారం చేయడం ఎంతో బాధను కలిగిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు.
కొన్ని అనారోగ్య సమస్యల వల్ల నేను ప్రస్తుతం ముంబైలో ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు.
గత కొంతకాలంగా నా భర్తకు దూరంగా ఉండాలని నేనే కోరుకున్నానని సైరా భాను పేర్కొన్నారు.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/11/saira-bhanu-comments-about-orce-AR-Rahman-detailsd!--jpg" /
పూర్తి విషయాలను తెలుసుకోకుండా కొంతమంది దారుణమైన కామెంట్లు చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.
మీడియాతో పాట్యు యూట్యూబ్ వాళ్లకు నా విన్నపం ఇదేనని ఆమె పేర్కొన్నారు.దయచేసి నా భర్త గురించి చెడుగా ప్రచారం చేయొద్దని ఆమె కోరారు.
ప్రపంచంలో నా భర్తకు ఉన్న మంచి గుర్తింపును చెడగొట్టవద్దని ఆమె తెలిపారు. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/11/saira-bhanu-comments-about-orce-AR-Rahman-detailss!--jpg" /
ఇప్పటికీ ఆయనంటే చాలా ఇష్టమని నాపై కూడా ఆయనకు ఎనలేని ప్రేమ ఉందని సైరా భాను పేర్కొన్నారు.
మా ప్రైవసీని కాపాడాలని మరికొన్ని రోజుల్లో చెన్నైకు వస్తానని సైరా భాను వెల్లడించారు.
సైరా భాను వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
ఏఆర్ రెహమాన్ విడాకుల విషయంలో ఎన్నో గాసిప్స్ ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో సైరా భాను తన కామెంట్లతో వైరల్ అవుతున్న వార్తలకు చెక్ పెట్టేశారు.
ఆమె క్లారిటీతో ఇకనైనా వార్తలు ఆగుతాయేమో చూడాల్సి ఉంది.
నాని సినిమాకు మెాహన్ బాబు ప్లస్ అవుతాడా? మైనస్ అవుతాడా..?