ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ పై సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు.. చెల్లి పెళ్లి జరిగిందంటూ?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే సక్సెస్ అందుకున్న వారిలో నటి సాయి పల్లవి( Sai Pallavi ) ఒకరు.

ఈమె ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమై మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు.

ఎలాంటి గ్లామర్ షోలకు తావు లేకుండా తన సహజ నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ప్రస్తుతం సాయి పల్లవి సౌత్ సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలకు కూడా కమిట్ అవుతున్నారు.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సాయి పల్లవి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ గురించి గతంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

"""/" / ఇటీవల సాయి పల్లవి చెల్లెలు పూజ ( Pooja ) వివాహం ఎంతో ఘనంగా జరిగింది.

ఈ వివాహానికి సంబంధించిన ఎన్నో వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే సాయి పల్లవి పెళ్లి గురించి కూడా ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్న తరుణంలో ఈమె ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ( Inter Caste Marriage ) గురించి మాట్లాడిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

నాకు చిన్నప్పుడు మా కమ్యూనిటీలోనే పెళ్లి చేసుకోవాలని చెప్పేవాళ్ళు.మా దాంట్లో చాలా మంది ఇప్పుడు వాళ్ళ కమ్యూనిటీ దాటి వేరే వ్యక్తులని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

కానీ వాళ్ళు మా ప్రాంతంలో నివసించట్లేదు. """/" / మా అమ్మ నాన్న కూడా ఇప్పుడు కోయంబత్తూర్లో నివసిస్తున్నారని తెలిపారు.

అయితే మా కమ్యూనిటీ వాళ్ళు మా కమ్యూనిటీలోనే పెళ్లి చేసుకోవాలని అలా కాకుండా వేరే వారిని పెళ్లి చేసుకుంటే వారిని మా కమ్యూనిటీలో జరిగే ఎలాంటి వేడుకలకు అలాగే అంత్యక్రియలకు కూడా రానివ్వరని సాయి పల్లవి తెలిపారు.

ఇది వాళ్ళ జీవితంపై ఎఫెక్ట్ పడుతుంది.నేను సినిమాలు చేసిన తర్వాత నా గురించి కూడా అలా మాట్లాడతారని నాకు తెలిసి ముందే మా నాన్నతో ఈ విషయాలన్నీ చెప్పానని తెలిపారు.

ఎవరో ఏమో అనుకుంటారని పిల్లలని బ్లాక్ మెయిల్ చేయకూడదని, అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటూ తమ నాన్నగారితో తాను క్లియర్ గా చెప్పానంటూ సాయి పల్లవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చిన అనిల్ రావిపూడి…