Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్ ఎదపై ఉన్న టాటూ వెనుక అర్థమిదే.. ఆమె మనస్సులో ఉన్న వ్యక్తి ఎవరంటే?
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్( Shraddha Srinath ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈమె మొదట జెర్సీ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
మొదటి సినిమాలో తన నటనతో అదరగొట్టింది.యూత్లో మంచి క్రేజ్ ను ఏర్పరచుకున్న ఈమె ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం కన్నడలో కూడా పలు సినిమాలలో నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈమె కన్నడ ఇండస్ట్రీ కి చెందిన ఆమె అయినప్పటికీ తెలుగులో కూడా బాగానే పాపులర్ అయింది.
"""/" /
ఇది ఇలా ఉంటే శ్రద్ధ శ్రీనాథ్ త్వరలోనే సైంధవ్ సినిమాతో( Saindhav Movie ) తెలుగు ప్రేక్షకులను పలకరించునుంది.
వెంకటేష్( Venkatesh ) హీరోగా నటించిన సైంధవ్ సినిమా సంక్రాతికి విడుదల కానుంది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉంది శ్రద్ధా శ్రీనాథ్.
ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె సినిమాలలో నటించడం పట్ల స్పందిస్తూ.తాను ఏదో ఒక సినిమా చేసేయాలి.
డబ్బులు సంపాదించాలని తాను ఇండస్ట్రీలోకి రాలేదని, తాను నటిగా నిరూపించుకునే పాత్రలు లభించినప్పుడు, మంచి సినిమాలు మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చింది.
ఏదో ఒక సినిమా చేయాలనే ఉద్దేశం తనకు ఉండదట.ప్రేమ, బ్రేకప్ వంటి కాన్సెప్టులతో వచ్చే చిత్రాలు, ఆ జానర్లు అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.
"""/" /
అందుకే శ్రద్దా శ్రీనాథ్ కృష్ణ అండ్ హిజ్ లీలా, జెర్సీ వంటి ఎమోషనల్ డ్రామాలను ఎంచుకుందన్న మాట.
పా రంజిత్‌తో ఓ సినిమా చేయాలని తనకు ఉందని చెప్పుకొచ్చింది శ్రద్దా శ్రీనాథ్.
తన టాటూని( Tattoo ) కూడా గమనిస్తున్నారా? వావ్ అంటూ శ్రద్దా శ్రీనాథ్ మురిసిపోయింది.
ఆ టాటూకి లవ్( Love ) అని అర్థమట.అది బీటల్స్ మ్యూజిక్ బ్రాండ్ లోగో అని చెప్పుకొచ్చింది.
అది తన క్రష్.పద్దెనిమిదేళ్ల వయసులో అతడు క్రష్‌గా ఉండేవాడట.
అతనే ఆ మ్యూజిక్ బ్యాండ్‌నే పరిచయం చేశాడట.అలా క్రష్‌నే టాటూగా వేయించుకుందట.
క్రష్ మాత్రమే లవ్ కాదు.క్రష్‌కి కూడా టాటూ వేయించుకుంటారా? అని యాంకర్ అడిగగా శ్రద్దా శ్రీనాథ్ నవ్వేసింది.
తాళి నా మొహాన విసిరికొట్టింది.. 32 ఏళ్లు కోర్టు చుట్టూ తిరిగా.. నటి మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు!