సింగనమలలో టీడీపీకి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్న శైలజానాథ్!

సింగనమలలో టీడీపీకి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్న శైలజానాథ్!

ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన అనంతపురంలోని సింగనమలలో.టీడీపీ ఆవిర్భావం తర్వాత ఈ నియోజకవర్గంలో జరిగిన తొమ్మిది ఎన్నికల్లో ఐదుసార్లు విజయం సాధించింది.

సింగనమలలో టీడీపీకి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్న శైలజానాథ్!

2019లో బండారు శ్రావణి పోటీ చేసినా 46 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

సింగనమలలో టీడీపీకి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్న శైలజానాథ్!

అయితే ఓటమి తర్వాత శ్రావణిని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా తొలగించారు.టీడీపీ అధిష్టానం పార్టీ వ్యవహారాల పర్యవేక్షణకు ఇద్దరు సభ్యుల కమిటీని నియమించగా, ప్రస్తుతం ఇంచార్జి లేరు.

పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

"""/"/ టీడీీపీ నుండి శైలజానాథ్ సింగనమల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఆయన గతంలో 2004, 2009లో రెండుసార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.ప్రస్తుతం జేసీ బ్రదర్స్‌, శైలజానాథ్‌లు వివాదాలు నడుస్తున్నాయి.

శ్రావణి మాత్రం ఈ నియయోజకవర్గాన్ని విడిచిపెట్టడం లేదు.నియయోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

అలాగే శైలజానాథ్ ఎంట్రీపై శ్రావణి అభ్యంతరం వ్యక్తం చేస్తూ తనను తానుగా ఇక్కడి నుండి ప్రమోట్ చేసుకుంటున్నారు .

ఈ నియోజకవర్గం నుంచి బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్తను పోటీకి దింపాలని టీడీపీ యోచిస్తున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది.

తదుపరి అభ్యర్థిపై స్పష్టత ఇవ్వడంలో పార్టీ జాప్యం చేస్తుండడంతో టీడీపీ క్యాడర్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది.

"""/"/ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతల్లో ఒకరిగా ఉన్నారు శైలాజనాథ్.ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేసిన ఆయన సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.

ప్రస్తుతం రాజకీయాల్లో అంత యాక్టీవ్‌గా కనిపించడంలేదు.ఒకప్పుడు ఫైర్‌బ్రాండ్ నాయకుడుగా ఓ వెలుగు వెలిగారు.

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో అంత చురుకుగా పాల్లోనలేదు.రఘువీరా రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించిన తర్వాత శైలజా నాథ్ పార్టీని పునరుద్ధరించే ప్రయత్నం చేయలేదు.

పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి పర్యటనల్లో పాల్గోనలేదు. .

కాలి నడకన తిరుమలకు నాని, శ్రీనిధి శెట్టి.. వీళ్ల డెడికేషన్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

కాలి నడకన తిరుమలకు నాని, శ్రీనిధి శెట్టి.. వీళ్ల డెడికేషన్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!