శైలజ రెడ్డి అల్లుడికి కేరళ వరద కష్టాలు.. విడుదల కష్టమేనేమో..

నాగచైతన్య, మారుతిల కాంభినేషన్‌లో తెరకెక్కిన శైలజ రెడ్డి అల్లుడు చిత్రం ఈనెల 31న విడుదల కావాల్సి ఉంది.

అయితే కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ చిత్రం విడుదల వాయిదా వేసే అవకాశం ఉందనిపిస్తుంది.

ఈ చిత్రంకు మలయాళ సంగీత దర్శకుడు గోపీ సుందర్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.ఇప్పటికే పాటల రికార్డింగ్‌ పూర్తి అవ్వడంతో పాటు, విడుదల కూడా జరిగింది.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన రీ రికార్డింగ్‌ వర్క్‌ను జరుపుతున్నారు.కేరళలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా అనుకున్న రీతిలో ఈ చిత్రం రీ రికార్డింగ్‌ వర్క్‌ జరగడం లేదు.

భారీ ఎత్తున ఈ చిత్రం విడుదల చేయాలని ప్లాన్‌ చేసుకున్న చిత్ర యూనిట్‌ సభ్యులకు షాక్‌ తలిగింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ప్రస్తుతం దర్శకుడు మారుతి కేరళలో చిక్కుకు పోయాడు.

రికార్డింగ్‌ పనుల కోసం అక్కడకు వెళ్లిన దర్శకుడు ఇప్పటికే రావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల రాలేక పోతున్నాడు.

దాంతో సినిమా విడుదల అయ్యేనా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇటీవల జరగాల్సిన ఆడియో వేడుక వాయిదా పడటంతో పాటు, ప్రీ రిలీజ్‌ వేడుకను కూడా నిర్వహించే అవకాశం లేకుండా పోయింది.

దాంతో ఈ చిత్రం విడుదల అవుతుందా లేదా అంటూ ప్రస్తుతం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రంను అనుకున్న తేదీకి విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

కేరళలో రీ రికార్డింగ్‌కు ఇబ్బందిగా ఉన్న కారణంగా హైదరాబాద్‌లో జేబీతో ఆ పని చేయించాలని నిర్ణయించారు.

గతంలో మారుతి పలు చిత్రాలకు జేబీ సంగీతాన్ని అందించాడు.అందుకే మారుతి ప్రస్తుతం జేబీతో ఆ వర్క్‌ చేయించేందుకు సిద్దం అవుతున్నాడు.

రీ రికార్డింగ్‌ వర్క్‌ ఆలస్యం అవుతున్న కారణంగా ఇప్పటికే సెన్సార్‌ కాపీ సిద్దం కావాల్సి ఉన్నా కూడా ఆలస్యం అవుతూ వస్తుంది.

మొత్తానికి కేరళలో కురుస్తున్న వర్షాలు నాగచైతన్య మూవీ శైలజ రెడ్డి అల్లుడుకు పెద్ద అడ్డంకిగా మారాయి.

ఒక వేళ ఆగస్టు 31న విడుదల కాకుంటే మాత్రం ఖచ్చితంగా తర్వాత విడుదల చేయడం ఇబ్బందే.