బ్రేకింగ్‌ : ‘ఆదిపురుష్‌’ లంకేష్‌పై క్లారిటీ

ప్రభాస్‌, బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ కాంబోలో తెరకక్కబోతున్న మూవీ 'ఆదిపురుష్‌'.

ఈ సినిమా షూటింగ్‌ వచ్చే ఏడాది ఆరంభం నుండి షురూ అయ్యే అవకాశం ఉంది.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి అప్‌ డేట్స్‌ మీద అప్‌ డేట్స్‌ ను ఇస్తున్నారు.

ఇప్పటికే సినిమాలో ప్రభాస్‌ రాముడిగా కనిపించబోతున్నాడు అంటూ క్లారిటీ ఇచ్చిన దర్శకుడు ఓం రౌత్‌ తాజాగా రావణుడి పాత్రలో నటించేది ఎవరు అంటూ క్లారిటీ ఇచ్చేశాడు.

ఆదిపురుష్‌ సినిమా ప్రకటించిన రోజే రావణుడి పాత్రకు గాను సైఫ్‌ అలీ ఖాన్‌ ను ఎంపిక చేశారని అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయంటూ వార్తలు వచ్చాయి.

అన్నట్లుగానే ఈ సినిమాకు సంబంధించిన రావణుడి గురించి అఫిషియల్‌ అనౌన్స్‌ మెంట్‌ వచ్చింది.

ఆదిపురుష్‌ లో సైఫ్‌ అలీ ఖాన్‌ లంకేష్‌ గా కనిపించబోతున్నాడు అంటూ పోస్టర్‌ విడుదల అయ్యింది.

పది తలల రావణుడి మాదిరిగా అలీ ఖాన్‌ కనిపించబోతున్నాడు.అందుకు సంబంధించిన పోస్టర్‌ విడుదల చేయడంతో ఫ్యాన్స్‌ లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

"""/"/ ఏకంగా 500 కోట్ల బడ్జెట్‌ తో రూపొందబోతున్న ఈ సినిమాను చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేస్తానంటూ దర్శకుడు ఓం రౌత్‌ చెబుతున్నాడు.

సినిమాను 2021లో ప్రారంభించి 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లుగా పేర్కొన్నాడు.రాముడు, రావణుడు ఓకే ఇక సీత ఎవరు అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

సినిమాకు సంబంధించిన షూటింగ్‌ వివరాలు మరికొన్ని రోజుల్లో వెళ్లడి అయ్యే అవకాశం ఉంది.