హీరోకు ప్రమాదం వందకు పైగా కుట్లు..హీరోయిన్ సపర్యలు
TeluguStop.com
చిత్ర పరిశ్రమకి చాలా మంది నటులు పరిచయం అవుతుంటారు.అందులో కొందరు అనుకోకుండా సినిమాలోకి వస్తే.
మరికొంత మంది సినిమాపై మక్కువతో ఇండస్ట్రీకి వస్తుంటారు.ఇక ఇండస్ట్రీకి వచ్చిన నటుల్లో కొంత మంది వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రేక్షకులకు అలరిస్తూ ఉంటారు.
అలాంటి నటుల్లో ఒక్కరు సైఫ్ అలీఖాన్.ఆ వ్యక్తిత్వం వల్ల ఓ సినిమా చిత్రీకరణలో ఆయన ప్రమాదానికి గురయ్యారనే సంగతి చాలామందికి తెలీదు.
అదే సినిమా? ఆ ప్రమాదం ఎలా జరిగిందో ఒక్కసారి చూద్దామా.ఇక కుందన్ షా దర్శకత్వంలో 2000లో తెరకెక్కిన చిత్రం ‘క్యా కహ్నా’.
సైఫ్ అలీఖాన్, ప్రీతి జింటా జంటగా నటించారు.ఈ సినిమాలో సైఫ్.
బైక్‌తో కొండపై జంప్ చేసే సన్నివేశం ఉంటుంది.దాని కోసం ప్రతి రోజూ రిహార్సల్ చేశారు సైఫ్.
కొన్ని రోజుల తర్వాత చిత్రీకరణకి ఖండాలా వెళ్లారు.చిత్ర బృందం అక్కడికి వెళ్లిన సమయంలో వర్షం పడటంతో సాధారణంగా ఉన్న నేలంతా బురదగా మారింది.
దర్శకుడు స్టార్ట్ చెప్పిన తర్వాత పాత్రలో పరకాయం ప్రవేశం చేసి ఓకే అనిపించారు
అయితే సైఫ్‌కి ఇంకా బాగా చేద్దాం అనే ఆలోచన రావడంతో మరో టేక్ తీసుకున్నారు.
ఇక రెండో ప్రయత్నంలో బైక్ పట్టుతప్పి ఓ రాయికి తగిలింది.ఈ ప్రమాదంలో సైఫ్ తలకి తీవ్ర గాయమైంది.
100 పైగానే కుట్లు పడ్డాయి.అయితే ప్రమాదం జరిగిన వెంటనే సైఫ్‌ని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు ప్రీతి, దర్శకుడు.
ఆ సమయంలో సైఫ్ భార్య వేరే ప్రాంతంలో ఉన్నారు.సైఫ్ స్నేహితుడికి ఫోన్ చేసి చెప్తే అతను జోక్ చేస్తున్నారనుకున్నాడు.
కాస్త అనారోగ్యంతో ఉండటంతో దర్శకుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు.దాంతో ప్రీతి ఒక్కరే సైఫ్ పక్కన ఉన్నారు.
మెడికల్ ఫామ్‌పై తనే సంతకం చేసింది.క్యా కెహ్నా విడుదలై 21 సంవత్సరాలు అయ్యింది.
విష్ణు కన్నప్ప సినిమాలో వాళ్ల కూతుర్ల పాత్ర ఏంటి..?