రావణుడి పాత్ర మొత్తం రీషూట్ చేయాల్సిందేనట.. కానీ సైఫ్ తో చిక్కులే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న లేటెస్ట్ సినిమా ఆదిపురుష్.ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

మరి ఈ సినిమా కోసం చూసే డార్లింగ్ ఫ్యాన్స్ కు ఓం రౌత్ బిగ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు.

ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2023 జనవరిలో రిలీజ్ అవ్వాల్సి ఉండగా దాదాపు 6 నెలల వాయిదా వేసాడు.

టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ ఖర్చుతో నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే.

సీతగా కృతి సనన్ నటిస్తుంది.లంకేశ్వరుడు రావణాసురిడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.

లక్ష్మణుడిగా బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నాడు.ఇటీవలే టీజర్ రిలీజ్ అవ్వగా భారీ ట్రోలింగ్ చేసారు.

ఓం రౌత్ అన్ని పాత్రలను మార్చేసి చూపించారని ఆరోపించారు.మరీ ముఖ్యంగా రావణాసురుడి పాత్రను అయితే పూర్తిగా మార్చేసి తీయడంతో చాలా ట్రోలింగ్ చేసారు.

ప్రేక్షకులకు పూర్తిగా అద్భుతమైన విజువల్ అనుభూతి ఇవ్వడం కోసం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లోని లంకేశ్వరుడు పాత్ర ను పూర్తిగా రీషూట్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.

"""/"/ ట్రోలింగ్ తొలగిపోయి సినిమాపై భారీ హైప్ వచ్చి సూపర్ హిట్ అవ్వాలంటే రీషూట్ తప్పదని.

టీమ్ ఆలస్యంగా తెలుసుకుందట.అయితే ఇప్పుడు ఈ టీమ్ కు మరో సమస్య వచ్చి పడింది.

రావణాసురుడి పాత్రలో నటించిన సైఫ్ పాత్ర మొత్తం రీషూట్ చేయాలంటే ఆయన అదనంగా కాల్షీట్స్ కేటాయించాలి.

కానీ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ లో ఇది జరగని పని అని తెలుస్తుంది.

కానీ ఈయన కాల్షీట్స్ దొరికితేనే ఈ సినిమా సమస్య తీరుతుంది.చూడాలి ఏం చేస్తారో.

అమృతంలో ఆ డైలాగ్స్ వల్ల జైలులో వేస్తామన్నారు.. హర్షవర్ధన్ సంచలన వ్యాఖ్యలు!