సాయిధరమ్ తేజ్ రిజెక్ట్ చేసిన కథకు ఓకే చెప్పిన రవితేజ?
TeluguStop.com
టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఐటీవలె ఖిలాడి,రామారావు ఆన్ డ్యూటీ ఇలాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు రవితేజ.రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
అయినప్పటికీ మాస్ మహారాజా ఏమాత్రం తగ్గకుండా అదే ఊపుతో సినిమాలు చేస్తూ మరిన్ని అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు.
కాగా ప్రస్తుతం రవితేజ ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.
ఇది ఇలా ఉంటే రవితేజ ఖాతాలోకి మరొక సినిమా వచ్చి చేరింది.సంపత్ నంది దర్శకత్వంలో మనం చేయడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవరనాగ వంశీ నిర్మించబోతున్నారు.కాగా ఈ సినిమా కొత్తదనం నిండిన కథాంశంతో పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే సంపత్ నంది ఈ సినిమా కథను రవితేజ కోసం రూపొందించినది కాదు.
రవితేజ కంటే ముందే ఎంతో మంది హీరోలకు ఈ సినిమా కథను వినిపించగా కొంతమంది హీరోలు ఓకే అని అనుకున్న తర్వాత మళ్లీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలు ఎక్కలేదు.
ఇక మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఒక దశలో ఈ కథకు ఓకే చెప్పి ఇంతలోనే ఆ సినిమాను చేయనని చెప్పేశాడట.
"""/"/
ఇక అదే కథని పట్టుకొని తిరుగుతున్న సంపత్ నంది చివరగా రవితేజకు వినిపించగా రవితేజ అందుకు ఓకే చెప్పారట.
ఇప్పటికే సంపత్ నంది దర్శకత్వంలో బెంగాల్ టైగర్ సినిమా పర్వాలేదు అనిపించింది.ఇక రవితేజ విషయానికి వస్తే ఇప్పటికే వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్న రవితేజ సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమాను ఎప్పుడు మొదలు పెడతారో చూడాలి మరి.
ఆడవాళ్ళ డైట్ లో కచ్చితంగా ఉండాల్సిన లడ్డూ ఇది..!