యాక్సిడెంట్ తర్వాత సాయితేజ్ ఫస్ట్ ఫోటో ఇదే.. బలహీనంగా అలా కనిపిస్తూ?
TeluguStop.com
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ వినాయక చవితి పండుగ రోజున బైక్ పై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్ నెల రోజులకు పైగా అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.
యాక్సిడెంట్ తర్వాత సాయితేజ్ ఫోటోలు బయటకు రాకపోవడంతో ఆయన అభిమానులు కంగారు పడ్డారు.
గత నెలలో పుట్టినరోజున డిశ్చార్జ్ అయిన సాయిధరమ్ తేజ్ ఆ తర్వాత పలువురు సెలబ్రిటీలను కలిసినా ఆయా సెలబ్రిటీలు సైతం సాయిధరమ్ తేజ్ ఫోటోలను షేర్ చేయలేదు.
అయితే దీపావళి పండుగ సందర్భంగా మెగా ఫ్యామిలీ హీరోలంతా ఒకే చోట చేరగా ఆ సమయంలో తీసిన ఫోటోను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
యాక్సిడెంట్ తర్వాత కోలుకున్న సాయితేజ్ ను చూడాలని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ సాయితేజ్ ఫోటోను చూసి సంతోషించారు.
చిరంజీవి తన ట్వీట్ లో సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడని అందరి ఆశీస్సులు, దీవెనలు ఫలించాయని పేర్కొన్నారు.
"""/"/
మా కుటుంబ సభ్యులకు ఇది నిజమైన పండుగ అంటూ చిరంజీవి తన పోస్ట్ లో చెప్పుకొచ్చారు.
గడ్డంతో, కళ్ల జోడుతో, స్లిమ్ లుక్ లో తేజ్ కనిపించడం గమనార్హం.యాక్సిడెంట్ తర్వాత బరువు తగ్గిన సాయిధరమ్ తేజ్ బలహీనంగా కనిపిస్తుండగా మరో నెలరోజుల్లో సాయితేజ్ నార్మల్ లుక్ లోకి వస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
మరోవైపు జనవరి నుంచి సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం.
భోగవల్లి ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తుండగా కొత్త డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని వార్తలు వస్తున్నాయి.
రిపబ్లిక్ సినిమాతో ఆశించిన స్థాయిలో హిట్ అందుకోని సాయిధరమ్ తేజ్ తన తరువాత సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్ కు భారీ స్థాయిలో క్రేజ్.. ఈ సీక్వెల్స్ హిట్టవుతాయా?