రెస్ట్ కోసం అక్కడికి వెళ్లనున్న సాయిధరమ్ తేజ్.. ఏం జరిగిందంటే?

యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ గత నెల 10వ తేదీన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన సంగతి తెలిసిందే.

అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్ వేగంగానే కోలుకుంటున్నాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

అతి త్వరలో సాయితేజ్ డిశ్చార్జ్ కానున్నాడని ప్రచారం జరుగుతోంది.అయితే డిశ్చార్జ్ అయిన తర్వాత సాయితేజ్ రెండు నెలలు రెస్ట్ తీసుకోనున్నారని తెలుస్తోంది.

అమెరికాకు వెళ్లి రెస్ట్ తీసుకోవాలని సాయితేజ్ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తుండటం గమనార్హం.

సాయితేజ్ కు రెండు సర్జరీలు జరిగాయని సమాచారం.సాయితేజ్ నటించిన రిపబ్లిక్ ఈ నెల 1వ తేదీన థియేటర్లలో విడుదలై బిలో యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

దసరా పండుగ తరువాత సాయితేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండటం, సరైన ఆహారం తీసుకోకపోవడంతో సాయితేజ్ బలహీనంగా ఉన్నాడని తెలుస్తోంది.

అమెరికాకు సాయితేజ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా వెళ్లనున్నారని సమాచారం.

హైదరాబాద్ లో ఉంటే ఆత్మీయులు, అభిమానుల పరామర్శల వల్ల సాయితేజ్ కు ప్రశాంతత ఉండదని భావించి అతని ఫ్యామిలీ మెంబర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

"""/"/ వచ్చే ఏడాది నుంచి సాయితేజ్ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఒకవైపు ప్రతిభ ఉన్న దర్శకులకు అవకాశాలు ఇస్తూనే కొత్త దర్శకులను కూడా సాయితేజ్ ప్రోత్సహిస్తున్నారు.

అభిమానులు సాయితేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.సాయితేజ్ ప్రమాదానికి సంబంధించి వేర్వేరు కథనాలు ప్రచారంలోకి వచ్చినా రోడ్డుపై ఇసుక ఉండటం వల్లే సాయితేజ్ కు గాయాలు అయ్యాయని తేలింది.

సాయితేజ్ హెల్మెట్ ధరించడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి.సాయితేజ్ ఎంటర్టైన్మెంట్ ఉండే కథలను ఎంపిక చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

తేజ సజ్జ బాటలోనే నడుస్తున్న విశ్వక్ సేన్…