వైరల్ అవుతున్న నిందితుడు రాజు భార్య కామెంట్స్... నా భర్తని శిక్షించడం కరెక్టే...

ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలోని సైదాబాద్ పరిసర ప్రాంతంలో జరిగిన 6 సంవత్సరాలు చిన్నారి చైత్ర ఘటన తెలుగు రాష్ట్రాలని కుదిపివేసిన సంఘటన అందరికీ తెలిసిందే.

దీంతో ఇటీవలే నిందితుడు రాజు కోసం పోలీసులు ఏకంగా 10 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు.

ఈక్రమంలో నిందితుడు రాజు అనుకోకుండా రైలు పట్టాల కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

కాగా తాజాగా నిందితుడు రాజు భార్య మౌనిక ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని నిందితుడు మరియు తన భర్త రాజు గురించి పలు విస్తుపోయే నిజాలను తెలిపింది.

ఇందులో భాగంగా తాము పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త చాలా బాగా చూసుకునే వాడని అలాగే తన కూతురుని కూడా చాలా ప్రేమించేవాడని చెప్పుకొచ్చింది.

అయితే తమ పెళ్లయిన తర్వాత తన భర్తలో అనుమానకరమైన సంఘటనలు చోటు చేసుకోలేదని కానీ తన జీవితంలో ఉన్నట్లుండి చోటు చేసుకున్న ఈ ఘటన తమ పూర్తి జీవితాలని తలకిందులు చేసిందని ఆవేదన వ్యక్తం చేసింది.

తన భర్త చేసిన ఈ పాడు పనికి కచ్చితంగా శిక్షించాల్సిందేనని కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

అయితే ఈ ఘోరమైన సంఘటన జరగక ముందు అప్పుడప్పుడు పని నిమిత్తమై చిన్నారి చైత్ర ఇంటికి వెళ్లి వస్తుండేదానినని కానీ తన భర్త అభం శుభం తెలియని చిన్నారిపై ఇలాంటి దారుణానికి ఒడిగడుతాడని కలలో కూడా అనుకోలేదని దాంతో తన భర్తకి ఆ దేవుడు సరైన శిక్ష విధించాడంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

"""/"/ అయితే ఈ విషయం ఇలా ఉండగా నిందుతుడు రాజు తల్లి కూడా ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని రాజు మరణంపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇందులో భాగంగా తన కొడుకు రాజు ఆత్మహాత్య చేసుకోలేదని పోలీసులే హత్య చేసారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

అలాగే తన కొడుకు మృతి చెందడం వల్ల తమ కుటుంబాన్ని పోషించే దిక్కు లేకపోయిందని కాబట్టి పోలీసులే తమని ఆదుకోవాలని కోరింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి20, సోమవారం2025