పవన్ బాటలోనే సాయి తేజ్.. ఫారిన్ అమ్మాయితో ప్రేమ, పెళ్లి?

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ గురించి అందరికీ తెలిసిందే.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు.

అంతేకాకుండా అతి తక్కువ సమయంలో మంచి అభిమానులను సంపాదించుకున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా తన మేనమామ బాటలో నడుస్తున్నట్లు తెలుస్తుంది.

2014లో పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

ఈ సినిమా తనకు మంచి విజయాన్ని అందించింది.ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా గుర్తింపు కూడా అందుకున్నాడు.

ఈ సినిమా తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.కొంతవరకు మంచి సక్సెస్ అందుకున్న మరికొన్ని సినిమాలు నిరాశపరిచాయి.

ఇక దేవకట్టా దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన రిపబ్లిక్ సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా తనకు మంచి సక్సెస్ ను అందించింది.ఇక ఈ సినిమా విడుదలకు ముందు సాయి ధరమ్ తేజ్ రోడ్ యాక్సిడెంట్ లో దాదాపు నెలకు పైగా హాస్పిటల్ లో ఉండి చికిత్స అందుకని ఇటీవలే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి తన ఇంటికి చేరుకున్నాడు.

ఇదిలా ఉంటే ఈ ప్రమాదానికి ముందు సాయి ధరమ్ తేజ్ పెళ్లి విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ గా మారింది.

కానీ అదే సమయంలో ప్రమాదం జరగడంతో అందరూ ఆ విషయాన్ని మర్చిపోయారు.ఇక మళ్లీ సాయి ధరమ్ తేజ్ కోలుకోవడంతో మళ్లీ తన పెళ్లి గురించి హాట్ టాపిక్ గా మారింది.

పైగా తాను పెళ్లి చేసుకునే అమ్మాయి గురించి కూడా తెలియడంతో అందరూ ఈ విషయం గురించి బాగా చర్చలు చేసుకుంటున్నారు.

"""/"/ సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరో కాదు తనతో పాటు తిక్క సినిమాలో నటించిన బ్రెజిలియన్ హీరోయిన్, మోడల్ లారిస్సా బోనేసి.

ఈ సినిమా సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.

ఇక ఈ బంధాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నట్లు లారిస్సా పెడుతున్న ట్వీట్ ల వల్ల అర్థమవుతుంది.

గతంలో ఆమె చేసిన ట్వీట్లు కూడా ప్రస్తుతం వైరల్ గా మారాయి. """/"/ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా విడుదల సమయంలో లారిస్సా సోషల్ మీడియా వేదికగా.

నా తేజు నటించిన రిపబ్లిక్ సినిమా ఈ రోజు విడుదల అవుతుంది అంటూ లవ్ సింబల్ తో పోస్ట్ చేసింది.

ఇక ఇటీవలే ఐ యామ్ ఇన్ లవ్ అంటూ మరో పోస్ట్ షేర్ చేయగా నెటిజనులంతా వీరిద్దరి మధ్య లవ్ నడుస్తుంది అని అనుకున్నారు.

ఇక త్వరలోనే వీరు కూడా వివాహ బంధంతో ఒకటవుతారు అని కామెంట్లు పెడుతున్నారు.

"""/"/ మరికొందరు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ లాగుతున్నారు.ఎందుకంటే పవన్ మూడో భార్య కూడా ఫారిన్ కి చెందిన అమ్మాయి కావడంతో సాయి ధరమ్ తేజ్ కూడా తన మామ బాటలో నడుస్తున్నాడని కామెంట్లు పెడుతున్నారు.

మరి ఈ విషయంలో ఎంత నిజముందో తెలియాలంటే సాయి ధరమ్ తేజ్ నోటినుండే తెలుసుకోవాలి.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై ఈడీ సంచలన ఆరోపణలు