24 గంటల్లోనే 11 మిలియన్స్.. ఇది పవర్ స్టార్ స్టామినా!
TeluguStop.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అండ్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కలిసి నటిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ అప్డేట్ కోసం ఎదురు చూడని ప్రేక్షకులు లేరు.
వినోదయ సీతం( Vinodhaya Sitham ) అనే తమిళ్ బ్లాక్ బస్టర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
అయితే ఇది రీమేక్ అయినప్పటికీ ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు.
"""/" /
అందులోను త్రివిక్రమ్( Trivikram ) ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందించడం వల్ల కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
ఇక ఈ సినిమా నుండి మొన్న మేకర్స్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేసిన విషయం తెలిసిందే.
''బ్రో''( Bro Movie ) అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు మోషన్ పోస్టర్ ద్వారా తెలిపారు.
ఈ టైటిల్ కు యునానిమస్ రెస్పాన్స్ లభించింది.ఇది రీమేక్ అని పవర్ స్టార్ మరో రీమేక్ నే చేస్తున్నాడు అని ఆయన ఫ్యాన్స్ డిజప్పోయింట్ అయిన విషయం తెలిసిందే.
కానీ ఈ ఫస్ట్ లుక్ చూసిన వారంతా ఈ సినిమాలో కనిపించిన మార్పులకు ఖుష్ అవుతున్నారు.
ఇక ఈ పోస్టర్ మొత్తంగా 24 గంటల్లోనే 11 మిలియన్ వ్యూస్ అందుకున్నట్టు మేకర్స్ తెలిపారు.
ఇది సౌత్ ఇండియాలోనే రికార్డ్ అని చెబుతున్నారు.ఇది పవర్ స్టార్ స్టామినా అంటూ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
"""/" /
తమిళ్ లో నటించి తెరకెక్కించిన సముద్రఖని ఇక్కడ కూడా తెరకెక్కిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన షూట్ ను పూర్తి చేసాడు.
దాదాపు 80 శాతం వరకు షూట్ పూర్తి కాగా మిగిలిన షూటింగ్ ను కూడా శరవేగంగా గ్యాప్ లేకుండా పూర్తి చేస్తున్నారు.
ఇక పీపుల్స్ మీడియా బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
అలాగే కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లు కూడా నటిస్తున్న ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
ప్రయాణంలో వాంతులా.. డోంట్ వర్రీ ఇలా చేయండి!