ఫీల్‌ అవ్వకండి… సాయి పల్లవి ఈ ఏడాది తెలుగు సినిమా చేస్తానంది

తెలుగు ప్రేక్షకులకు ఫిదా సినిమా తో పరిచయం అయిన ముద్దుగుమ్మ సాయి పల్లవి మొదటి సినిమా తోనే ప్రేక్షకులు ఫిదా అయ్యేలా నటించిన విషయం తెలిసిందే.

ఆ సినిమా తర్వాత సాయి పల్లవి తెలుగు లో వరుసగా ఆఫర్స్ సొంతం చేసుకుంది.

ఒకానొక సమయం లో ఆమె స్టార్ హీరో లకి కూడా నో చెప్పేంత బిజీ అయింది.

కమర్షియల్ సినిమాలు కాకుండా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా లు చేయాలని సాయి పల్లవి మొదటి నుండి భావిస్తుంది.

అందుకే విభిన్నమైన కథ నేపథ్యం ఉన్న సినిమాలను మాత్రమే ఆమె కమిట్ అయింది.

"""/"/ అలాంటి సినిమా లను కంటిన్యూగా చేస్తే పర్వాలేదు అనుకున్న అభిమానులు ఈ మధ్య కాలం లో ఆమె సినిమాలు చేయక పోవడం తో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోలీవుడ్ లో ఒక సినిమా కు ఇటీవల ఓకే చెప్పిన సాయి పల్లవి తెలుగు లో మాత్రం అస్సలు సినిమాలు చేయక పోవడం తో తెలుగు ప్రేక్షకులు చేసుకున్న పాపం ఏంటి అంటూ సోషల్ మీడియా లో అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.

"""/"/ ఈ సమయం లో ఆమె సన్నిహితులు సాయి పల్లవి తెలుగు లో కూడా నటించబోతుంది అంటూ క్లారిటీ ఇచ్చారు.

అతి త్వరలోనే సాయి పల్లవి తెలుగు సినిమా మొదలు కాబోతుందని వారు పేర్కొన్నారు.

ఈ ఏడాది లోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.

టాలీవుడ్ లో సాయి పల్లవి కి ఉన్న డిమాండ్ నేపథ్యం లో ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కూడా నిర్మాతలు సిద్ధం గా ఉన్నారు.

అయినా కూడా సాయి పల్లవి సినిమా ల ఎంపిక విషయం లో ఆసక్తి చూపడం లేదంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

సాయి పల్లవి తెలుగు లో అతి త్వరలో కమిట్ కాబోతున్న సినిమా ఏంటి అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.