ఆ ప్రాబ్లం తో బాధపడుతున్న సాయి పల్లవి…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటిస్తున్న ప్రస్తుతపు హీరోయిన్లందరిలో సాయి పల్లవి( Sai Pallavi ) చాలా ప్రత్యేకంగా ఉంటుంది అనే చెప్పాలి.
ఇక సాయి పల్లవి ఫిదా( Fidaa Movie ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైంది.
తొలి సినిమాతోనే సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది.అలాగే తనదైన అందం, అభినయం, నటనతో యూత్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది.
"""/" /
అందాల ఆరబోతకు దూరంగా ఉంటూనే స్టార్ స్టేటస్ అందుకున్న అతి తక్కువ మంది హీరోయిన్లలో సాయి పల్లవి ఒకటి.
కెరీర్ ఆరంభం నుంచి ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్‌లోనూ చాలా పద్ధతిగా కనిపిస్తూ ఆకట్టుకుంది.
కేవలం నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలతోనే ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోంది.ఇకపోతే సినిమాల్లో సాయి పల్లవి చాలా సహజంగా కనిపిస్తుంది.
దాదాపు హీరోయిన్లందరూ మేకప్ తో తమ అసలు అందాన్ని దాచేస్తుంటారు.కానీ, సాయి పల్లివి అందుకు పూర్తిగా భిన్నం.
మేకప్ లేకుండానే ఆమె ప్రతి సినిమాలోనూ నటిస్తుంది.ఈ విషయంలో చాలా మంది ఆమెకు అభినందిస్తుంటారు.
కానీ, కెరీర్ ఆరంభం నుంచి ఆమె మేకప్ కు దూరంగా ఉండానికి ఒక బలమైన కారణం ఉందట.
సాయి పల్లవి పలు చర్మ సమస్యలతో బాధపడుతుందట. """/" /
మేకప్ ఉత్పతులను వాడితే ఆమె చర్మంపై ర్యాషెస్, తీవ్రమైన దురద వంటివి తలెత్తుతాయట.
పైగా మొదటి నుంచి ఆమెకు అసలు మేకప్ వేసుకునే అలవాటు లేదట.తొలి చిత్రం `ప్రేమమ్`( Premam Movie ) లోనూ మేకప్ వేసుకోకుండానే నటించింది.
అయితే ఆ టైమ్ లో తన అందంపై సాయి పల్లవి ఎంతో టెన్షన్ పడింది.
కానీ, ప్రేక్షకులు ఆమెను బాగా రిసీవ్ చేసుకున్నారు.దాంతో సాయి పల్లవి తనకు మేకప్ అవసరం లేదని అప్పుడే డిసైడ్ అయిందట.
కాగా, సినిమాల విషయానికి వస్తే.ప్రస్తుతం ఈ బ్యూటీ కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో ఓ సినిమా చేస్తున్నారు.
కమల్ హాసన్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది.
ఏది ఏమైనా సాయి పల్లవి ఈ జనరేషన్ లో మొహానికి మేకప్ వేయకుండా చాలా మంది అభిమానులను సంపాదించుకుంది అంటే గ్రేట్ అనే చెప్పాలి.