కథలే నన్ను వెతుక్కుంటూ వస్తాయ్.. సాయి పల్లవి వైరల్ కామెంట్స్!

వేణు ఉడుగుల దర్శకత్వంలో సాయి పల్లవి, రానా జంటగా నటించిన తాజా చిత్రం విరాటపర్వం.

ఈ సినిమా జూన్ 17న విడుదల కానున్న విషయం తెలిసిందే.విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేసింది.

ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన సాయి పల్లవి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

తెలుగులో సినిమాలు ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటి అని మీడియా ప్రతినిధి అడిగగా.అ విషయం పై స్పందించిన సాయి పల్లవి.

తాను కరోనా మహమ్మారి రాక ముందు లవ్‌ స్టోరీ,విరాటపర్వం సినిమాలలో నటించానని ఆ తర్వాత శ్యామ్‌ సింగరాయ్‌ చిత్రంలో నటించానని చెప్పుకొచ్చింది.

ఇకపోతే ప్రస్తుతం సినిమాలకు గ్యాప్‌ రావడమనేది కావాలని తీసుకున్నది కాదని, అసలు గ్యాప్‌ గురించే ఆలోచించను అని తెలిపింది నాచురల్ బ్యూటీ.

అలాగే తనకు సినిమా కథలు రాసి పెట్టి ఉంటే అవే తనని వెతుక్కుంటూ వస్తాయని,తాను సినిమాల ఎంపిక విషయంలో తొందరపడనని, నచ్చిన స్క్రిప్ట్ లనే ఎంచుకుంటాను అని తెలిపింది.

"""/" / అలాగే మనం చేసే సినిమాలు నెక్ట్స్ తరానికి కూడా గుర్తిండిపోయేలా ఉండాలని, అందుకే స్క్రిప్ట్ ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పు కొచ్చింది సాయి పల్లవి.

అదేవిదంగా తక్కువ సినిమాలు చేస్తున్నాన.లేక ఎక్కువ చేస్తున్నానా.

అనేది తాను పట్టించుకోనను మంచి సినిమా చేయాలనేదే తన లక్ష్యమని తెలిపింది.ఇకపోతే ఈ నేచురల్ బ్యూటీ సాయిపల్లవికీ యూత్ లో ఈ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే.

సినిమాలలో తన అందం, నటనతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తూ ఉంటుంది.

బ‌రువు త‌గ్గాల‌ని భావించేవారు క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే..!