మెగా ఈవెంట్‌ లో పాల్గొనేందుకు నో చెప్పిన సాయి పల్లవి

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఐపీఎల్( IPL ) తాజాగా ప్రారంభమైంది.

ప్రారంభ వేడుకల్లో స్టార్ హీరోయిన్స్ రష్మిక మందన( Rashmika Mandana ) మరియు మిల్కీ బ్యూటీ తమన్నా ( Tamannaah )సందడి చేసిన విషయం తెలిసిందే.

బాలీవుడ్ కి చెందిన స్టార్స్ కూడా ప్రారంభ వేడుకల్లో హడావుడి చేశారు.తాజాగా జరిగిన ఈ వేడుక లో బాలకృష్ణ సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఆ విషయం పక్కన పెడితే మెగా ఈవెంట్ లో గెస్ట్ గా హాజరవ్వడం కోసం సాయి పల్లవి ని సంప్రదించారట.

కానీ సాయి పల్లవి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చిన కూడా హాజరయ్యేందుకు ఓకే చెప్పలేదట.

ఒక్క డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట.అయినా కూడా సాయి పల్లవి నో చెప్పిందట.

స్వతహాగా డాన్సర్ అయిన సాయి పల్లవి ఈ కార్యక్రమానికి ఓకే చెబుతుందని అంతా భావించారట, కానీ సాయి పల్లవి నో చెప్పడం తో ఐ పీ ఎల్ నిర్వహకులు షాక్‌ అయ్యారట.

"""/" / సాయి పల్లవి ఇప్పటికే సినిమాలకు దూరంగా ఉంటుంది.ఇలాంటి కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండడానికి కారణం ఏంటో అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుందని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.కానీ తెలుగు సినిమాలు మాత్రమే కాదు అన్ని సినిమాలకు మరియు కార్యక్రమాలకు కూడా సాయి పల్లవి దూరంగా ఉంటుందని దీంతో నిరూపితమైంది.

విషయం లో చాలా మంది అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తామంటున్నా కూడా సాయి పల్లవి నటించినందుకు ముందుకు రాక పోవడమేమిటో అంటూ విడ్డూరంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సాయి పల్లవి అసలు ఎందుకు సినిమాలకు మరియు ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటుందో చెప్పాల్సి అవసరం ఉంది.

సీక్వెల్ సినిమాలో రకుల్ ఉంటే సినిమా ఫ్లాపేనా… ట్రోల్స్ మామూలుగా లేవుగా?