సాయి పల్లవి నిర్మాతల హీరోయిన్.. ఎందుకంటే?

టాలీవుడ్ హీరోయిన్ మలయాళీ ముద్దుగుమ్మ అయినా సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మొదట మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమా టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది.

ఆ సినిమాలో ఆమె నటన తో యూత్ లో కట్టిపడేసింది.భానుమతి హైబ్రిడ్ పిల్ల ఒక్కటే పీస్ అన్న డైలాగ్ అన్న డైలాగ్ ఏ రేంజ్ లో పాపులర్ అయ్యిందో మనందరికీ తెలిసిందే.

అయితే దర్శకుడు శేఖర్ కమ్ముల తన కోసమే ఆ డైలాగ్ ను రాసినట్లుగా మార్చేసుకుంది ఈ నేచురల్ బ్యూటీ.

మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఆమె డాన్స్ కి చాలా మంది యువత ఫిదా అయ్యారు.

సాయి పల్లవి తన సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తు సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది.

సాయి పల్లవి తాజాగా నటించిన సినిమా విరాటపర్వం.ఈ సినిమా జూన్ 17న విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ప్రమోషన్స్ కోసం గత వారం రోజులుగా హైదరాబాదులోనే బిజీబిజీగా ఉంది సాయి పల్లవి.

ఇటీవల విడుదలైన శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రమోషన్స్ కోసం కూడా ఆమె 15 రోజుల సమయాన్ని వెచ్చించింది.

ఈ మధ్యకాలంలో ఏ హీరోయిన్ కూడా ఈ విధంగా ప్రమోషన్స్ కోసం సమయాన్ని వెచ్చించడం లేదు.

"""/"/ అలా అని సాయి పల్లవి ప్రమోషన్స్ కోసం అదనపు చార్జీలు కూడా వసూలు చేయడం లేదు.

అంతే కాకుండా ప్రతీ హీరోయిన్ కూడా ప్రమోషన్స్ కోసం వాడితో పాటుగా ముగ్గురు నలుగురు సిబ్బందిని తీసుకు వస్తారు.

కానీ సాయి పల్లవి మాత్రం సింగిల్ గా లేదంటే ఒకరిని తీసుకువస్తుంది.వారికి కూడా తన రెమ్యునరేషన్ నుండి డబ్బులు చెల్లిస్తుంది.

ఒకవేళ ఏదైనా ఇంటర్వ్యూ ఉదయం 9 గంటలకు ఉంటే ఆమె ముందుగానే వస్తుంది.

ఇంకా కొన్ని సార్లు అయితే ఇంటర్వ్యూయర్ కన్నా ముందుగానే వస్తుంది.అంతే కాకుండా ఆమెకు ఫుడ్డు కూడా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదే.

అలాగే ఆమె ప్రయాణించడానికి ఈ కార్లను కూడా అవి కావాలి ఇవి కావాలి అని డిమాండ్ చేయకుండా సర్దుకుపోతూ ఉంటుంది.

ఇలా ప్రతి విషయాలలో అనుకూలంగా ఉంటూ టాలీవుడ్ లో నిర్మాతలకు అత్యంత అనుకూలమైన హీరోయిన్ సాయి పల్లవి అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

ఫుట్‌బాల్ మైదానాన్ని మింగేసిన సింక్ హోల్.. వీడియో వైరల్..