సోదరి పెళ్లిలో డ్యాన్స్ తో ఫిదా చేసిన సాయిపల్లవి.. ఈ బ్యూటీ డ్యాన్స్ సూపర్ అంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సాయి పల్లవి ( Heroine Sai Pallavi )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

సాయి పల్లవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలలో కూడా నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం ఈమె తెలుగులో నాగచైతన్య సరసన తండేల్( Tandel ) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇకపోతే సాయి పల్లవి డాన్స్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

"""/" / ఆమె డాన్స్ కు సపరేట్ ఫాన్స్ ఫాలోయింగ్ ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇప్పటికే చాలా సందర్భాలలో స్టేజ్ పై డ్యాన్స్ చేసి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మరోసారి తనలో ఉన్న డాన్స్ టాలెంట్ ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.

తాజాగా సాయి పల్లవి తన చెల్లెలు పెళ్లి చేసింది.తమిళనాడు లో సంప్రదాయబద్ధంగా వీళ్ల వివాహం జరిగింది.

ఈ పెళ్లిలో తన డాన్స్ తో అందర్నీ మెస్మరైజ్ చేసింది సాయిపల్లవి.5 పాటలకు సోలో పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆహుతుల్ని అలరించింది.

తర్వాత బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి మరో 5, 6 పాటలకు డాన్స్ చేసింది.

"""/" / పెళ్లిలో సాయి పల్లవి ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అదే టైమ్ లో సాయిపల్లవి పెళ్లి టాపిక్ కూడా తెరపైకొచ్చింది.నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అంటూ చాలామంది ఆమెను ప్రశ్నించడం మొదలుపెట్టారు.

తను జీవితంలో పెళ్లి చేసుకోనని గతంలో సాయిపల్లవి ప్రకటించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సాయి పల్లవి అభిమానులు ఆ వీడియోలో తెగ వైరల్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Vegas Aces Bonuses And Promotions (UK) – A Practical Value Assessment