Sai Pallavi : కాశ్మీర్ లో సాయి పల్లవి.. అందుకోసమే అక్కడికి వెళ్లిందా?

sai pallavi : కాశ్మీర్ లో సాయి పల్లవి అందుకోసమే అక్కడికి వెళ్లిందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి( Sai Pallavi ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

sai pallavi : కాశ్మీర్ లో సాయి పల్లవి అందుకోసమే అక్కడికి వెళ్లిందా?

సాయి పల్లవి పేరు వినగానే ముందుకు గుర్తుకు వచ్చేది ఆమె నేచురల్ అందం ఆమెకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్.

sai pallavi : కాశ్మీర్ లో సాయి పల్లవి అందుకోసమే అక్కడికి వెళ్లిందా?

ఈమెకు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది అంటే అభిమానులు ఈమెను జూనియర్ పవర్ స్టార్ అని కూడా పిలుస్తూ ఉంటారు.

ఇకపోతే సాయి పల్లవి సెలక్టీవ్ గా సినిమాలు చేస్తూ, కేవలం నటనకు ప్రాధాన్య పాత్రలనే ఎంచుకుంటూ, గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తోంది.

రానా సరసన గార్గీ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. """/" / ఈ సినిమా తర్వాత సాయి పల్లవి మరే సినిమాలోను నటించలేదు.

దాంతో సాయి పల్లవి సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసిందని పెళ్లి చేసుకోబోతుందని ఇలా రకరకాల వార్తలు వినిపించినప్పటికీ సాయి పల్లవి మాత్రం ఆ వార్తలపై స్పందించలేదు.

దానికి తోడు ఈమె సోషల్ మీడియాతో పాటు ఎక్కడా కనిపించకపోవడంతో సాయి పల్లవి ఎక్కడికి వెళ్లిందా అని అభిమానులు ఆరా తీయగా సడెన్ గా కాశ్మీర్( Kashmir ) లో ప్రత్యక్షం అయ్యింది.

అక్కడ ఏం చేస్తుంది అని ఆరా తీయ్యగా.ఆమె తమిళ సినిమా షూటింగ్ కోసం కశ్మీర్ వచ్చినట్టు తెలుస్తోంది.

"""/" / తమిళ నేచురల్ స్టార్ గా పేరుతెచ్చుకున్న హీరో శివ కార్తికేయన్‌, రాజ్‌కుమార్‌ పెరియసామి ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

ఈసినిమా SK21 వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటోంది.ఇక ఈ సినిమాలో శివ కార్తికేయ‌న్ స‌ర‌స‌న సాయిప‌ల్ల‌వి హీరోయిన్ గా న‌టిస్తోంది.

లోక‌నాయ‌కుడు కమల్‌హాసన్‌( Kamal Haasan ) ఆర్‌.మహేంద్రన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ సినిమాను సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ సమర్పిస్తోంది.

రెహమాన్ మేనల్లుడు యంగ్ స్టార్ జి.వి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో విశ్వ‌రూమ్ ఫేం రాహుల్ బోస్ విల‌న్‌గా న‌టిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కశ్మీర్ లో జరుగుతోంది.మేలో చెన్నైలో స్టార్ట్ అయిన ఈసినిమా షూటింగ్ ప్రస్తుంతం కశ్మీర్ చేరింది.

కాగా ఈ షూటింగ్ కోసం సాయి ప‌ల్ల‌వి కూడా కశ్మీర్ వెల్లగా ఆమె అక్కడ షూటింగ్ లోకేష‌న్‌లో దిగిన ఫోటోలు, రాహుల్ బోస్ మేక‌ప్ వేసుకుంటున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇక ఈ నెల అంతా కశ్మీర్ లోనే ఈ మూవీ షూటింగ్ జరగబోతున్నట్టు తెలుస్తోంది.

అందరికి బతుకు పోరాటం అంత సులువుకాదు సుమా.. ఇతన్ని చూసి నేర్చుకోవాల్సిందే!