30 రోజులు నిద్ర లేదు నరకం అనుభవించాను.. సాయి పల్లవి ఎమోషనల్ కామెంట్స్!

ప్రేమమ్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి సాయి పల్లవి.

( Sai Pallavi ) ఇలా మలయాళ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇక తెలుగులో ఈమె ఫిదా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ప్రేక్షకులందరికీ కూడా తన నటన డాన్స్ తో ఫీదా చేసేసారు.

ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సాయి పల్లవి తాజాగా అమరన్( Amaran ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా తెలుగు తమిళ భాష చిత్రాలలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

"""/" / ఇట ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో సాయి పల్లవి ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఈ క్రమంలోనే నటన పరంగా ఆమె ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

సాధారణంగా సినిమాలకు కమిట్ అయిన తర్వాత సాయి పల్లవి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన పనిని పూర్తి చేస్తారని పని పట్ల 100% న్యాయం చేస్తారని చెప్పాలి.

ఇలా నటనపరంగా ఎంతో ఆసక్తి చూపి సాయిపల్లవి ఓ సినిమా షూటింగ్లో మాత్రం బాగా ఏడ్చినట్టు తెలిపారు.

"""/" / శ్యామ్ సింగరాయ్( Shyam Singha Roy ) సినిమా షూటింగ్ సమయంలో ఈమె 30 రోజులపాటు రాత్రి షూటింగ్లో పాల్గొనాల్సి వచ్చినట్టు తనకు నైట్ మేలుకుంటే పగలు అసలు నిద్ర రాదని అంతేకాకుండా పగలు మరొక సినిమా షూటింగ్లో పాల్గొనడం వల్ల తనకు నిద్ర సరిగా ఉండేది కాదని దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని సాయి పల్లవి తెలిపారు.

ఇలా ఈ సినిమా షూటింగ్లో ఉన్న సమయంలో ఓసారి ఆమె చెల్లి రావడంతో తన బాధను బయట పెడుతూ కన్నీళ్లు పెట్టుకున్నానని తెలిపారు.

ఇక పూజ వెంటనే డైరెక్టర్ వద్దకు వెళ్లి మా అక్కకు లీవ్ కావాలని చెప్పడంతో డైరెక్టర్ ఓకే సారీ పది రోజులపాటు సెలవు ఇచ్చినట్లు సాయి పల్లవి తెలిపారు.

మటన్ తినడం లాభమా.. నష్టమా?