సాయి పల్లవికి మేకప్ వేసుకోవడం నచ్చదు.. అసలు కారణం ఏంటంటే?
TeluguStop.com
మామూలుగా సినీ ప్రపంచం అంటేనే మేకప్( Makeup ) అని చెప్పాలి.అక్కడ నటీనటులు మేకప్ వేసుకోకుండా నటించడం అనేది సాధ్యం కాదు.
అటువంటిది సాయి పల్లవి( Sai Pallavi ) మాత్రం మేకప్ వేసుకోకుండా నటిస్తుంది.
మామూలుగా ఏ హీరోయిన్స్ అయినా సరే మేకప్ లేకుండా కెమెరా ముందుకు అసలు రారు.
ఒక షార్ట్ లో బ్రేక్ దొరుకుతే చాలు టచ్ అప్ అంటూ మేకప్ కే ఇంపార్టెంట్ ఇస్తారు.
కానీ సాయి పల్లవి మాత్రం మేకప్ కు దూరంగా ఉంటుంది.ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలలో తను మేకప్ వేసుకున్న సందర్భం అసలు కనిపించలేదు.
మొత్తం నాచురల్ అందం తోనే సినిమాలు చేసి మంచి హిట్లు అందుకుంది.ఒక హీరోయిన్ హోదాలో ఉన్నప్పటికీ కూడా ఆమె మేకప్ వేసుకోకపోవటానికి కారణం ఒకటి ఉందని తెలిసింది.
ఇక ఆ కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. """/" /
సాయి పల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
టాలీవుడ్ హైబ్రిడ్ పిల్లగా ఒక గుర్తింపు తెచ్చుకుంది.తన న్యాచురల్ అందాలతో తెలుగు ప్రేక్షకులను తన వైపుకు మలుపుకుంది.
మొదట్లో డాన్స్ లు చేస్తూ అందరి దృష్టిలో పడిన సాయి పల్లవి ఆ తర్వాత ఫిదా సినిమాతో( Fidaa Movie ) తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ.
కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం భాషలో కూడా నటించి మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది.
తక్కువ సమయంలో స్టార్ క్రేజ్ సొంతం చేసుకుంది.ఇక ఈమె ఎంచుకునే సినిమాలు, పాత్రలు కూడా హోమ్లీ గా ఉంటాయి.
చాలావరకు డబ్బుకు ఆశపడకుండా పాత్రకు ఇంపార్టెంట్ ఇస్తుంది సాయి పల్లవి.గ్లామర్ షో చేయడానికి కూడా అంతగా ఇష్టపడదు.
తనకు కంటెంట్ నచ్చకపోతే పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు కూడా వదిలేసుకుంటుంది.
అందుకే ఆలస్యమైన సరే మంచి మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది సాయి పల్లవి.
ఇక ఈమె తోటి హీరోయిన్ లంతా అందాలను ఆరబోస్తున్నప్పటికీ కూడా ఈమె మాత్రం అలాగే ఉంటుంది.
అందుకే టాలీవుడ్ ప్రేక్షకులు ఈమెను అభిమాన హీరోయిన్ గా గుండెల్లో నిలుపుకున్నారు.అంతేకాకుండా ఆమె న్యాచురల్ బ్యూటీ అని మేకప్ వేసుకోకుండా నటిస్తుంది అని తెలిసినప్పటి నుంచి ఆమెపై మరింత అభిమానం పెంచుకున్నారు.
"""/" /
అయితే ఈమె మేకప్ వేసుకోకపోవటానికి మాత్రం ఒక కారణం ఉంది.
అదేంటంటే.తను చిన్నప్పటి నుంచి తన వాయిస్ పట్ల, తన ఫేస్ పై ఉండే మొటిమల పట్ల చాలా ఇబ్బందిగా ఉండేదట.
అలా చాలా విషయాలు తనను చాలా భయపెట్టాయట.ఇక మొదటి నుంచి తను పెద్దగా మేకప్ అనేది వాడలేదట.
అలా అలవాటు లేకపోవడంతో తన మొదటి సినిమా ప్రేమమ్( Premam Movie ) లో కూడా మేకప్ లేకుండా నటించిందట.
ఇక ఆ సమయంలో చూసే ప్రేక్షకులు తనను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చాలా టెన్షన్ గా ఉండేదట.
కానీ సినిమా తర్వాత అందరూ తనను తన లాగా చూశారట.అలా ప్రేక్షకులు తనపై అభిమానం చూపించటంతో తనలో మరింత ఆసక్తి పెరిగిందని.
అందుకే అప్పటినుంచి ఏ సినిమాల్లో కూడా మేకప్ వేసుకోకుండా నటిస్తానని తెలిపింది.
నాగార్జున వందో సినిమా దర్శకుడు ఎవరో తెలిసిపోయిందా..?