Sai Pallavi : ఏ సినిమా కోసం కూడా ఇప్పటి వరకు మేకప్ వేసుకోలేదు : సాయి పల్లవి
TeluguStop.com
సినిమాలలో హీరోయిన్లు డి గ్లామరస్ రోల్స్ చెయ్యడం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది.పుష్ప లో రష్మిక,( Rashmika Mandanna ) రంగస్థలం లో సమంత డి గ్లామరస్ రోల్స్ చేసి ప్రేక్షకులను మెప్పించారు.
కానీ ఈ మధ్యే మొదలయిన ఒక కొత్త ట్రెండ్.అంతకు ముందు హీరోయిన్ అంటేనే గ్లామర్.
హీరోయిన్ అవ్వాలంటే తెల్ల తోలు ఉండాల్సిందే.మేకప్ వెయ్యాల్సిందే.
కానీ సాయి పల్లవి మాత్రం సినిమా పరిశ్రమలో ఉన్న ఈ నియామకాలకు అతీతం.
ఆమె ఇప్పటివరకు నటించిన ఒక్క సినిమాలో కూడా మేకప్ వేసుకోలేదు.కానీ వరుస అవకాశాలతో సౌత్ సినిమా ఇండస్ట్రీస్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతోంది.
ఐతే సినిమా దర్శకులు, టెక్నిషియన్లు ఆమె నిర్ణయాన్ని గౌరవించారు. """/" /
మలయాళం చిత్రం ప్రేమమ్ తో సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు సాయి పల్లవి.
( Sai Pallavi ) మొహం నిండా పింపుల్స్ తో ఎటువంటి మేకప్ లేకుండా ఆ సినిమాలో నటించారు సాయి పల్లవి.
ఐతే సినిమా చూసిన ప్రతి ఒక్కరు సాయి పల్లవి క్యారెక్టర్ కి ఫిదా ఐపోయారు.
కారణం ఆమె టిపికల్ సినిమా హీరోయిన్ లా కాకుండా తమ పక్కింటి అమ్మాయిలా కనిపించడమే.
ప్రేమమ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసినదే.ఆ తరువాత ఆమె చాలా చిత్రాలలో నటించింది.
కానీ తన నో మేకప్ పాలసీ ని మాత్రం వదలలేదు.శేఖర్ కమ్ముల ( Sekhar Kammula )దర్శకత్వం లో వచ్చిన ఫిదా చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు సాయి పల్లవి.
ఈ చిత్రంలో ఆమె ఒక పల్లెటూరి మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్ర చేసారు.
అందుకేనెమో.ఈ సినిమాలో కూడా ఆమె పాత్ర అందరికి బాగా కనెక్ట్ అయ్యింది.
"""/" /
ఇలా సాయి పల్లవి నటించిన పాత్రలన్నీ మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలు, లేదా పల్లెటూరి అమ్మాయి పాత్రలే.
మళ్ళి తనకు మేకప్ వేస్తే వాళ్లకు కావలసిన ఆ పక్కింటి అమ్మాయి లుక్ ఎక్కడ మిస్ ఐపోతుందో అని భయపడ్డారేమో దర్శకులు.
వాళ్ళు కూడా ఆమెను మేకప్ వేసుకోమని ఎప్పుడు బలవంతం చేయలేదట.సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, తనకు మేకప్ వేసుకోకపోయినా నటించగలననే కాంఫిడెన్స్ వస్తుందని, అందుకే ఎప్పుడు మేకప్ అవసరం అనిపించలేదని అన్నారు.
నటించేటప్పుడు కేవలం ఎయె లైనర్ మాత్రమే వేసుకుంటారా సాయి పల్లవి.కేవలం ఆమె నటించిన విరాట పర్వం( Virata Parvam ) చిత్రానికి మాత్రమే షాట్ తీసేముందు మొహం కడుక్కునేవారట.