నేను మనిషినే కదా.. నా ముందు ఇలాంటి పని చేయకండి.. సాయిపల్లవి కామెంట్స్ వైరల్!

హీరోయిన్ సాయి పల్లవి( Sai Pallavi ) గురించి మనందరికీ తెలిసిందే.ముద్దుగుమ్మకు ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అభిమానులు ఈమెను లేడీ పవర్ స్టార్ అని కూడా పిలుస్తూ ఉంటారు.ఇంస్టాగ్రామ్ లో కూడా సాయి పల్లవి మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు.

సినిమాలలో తన అద్భుతమైన నటన డాన్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతోంది సాయి పల్లవి.

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తోంది.అందులో భాగంగానే ఇటీవల అమరన్ మూవీ( Amaran Movie ) తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న సాయి పల్లవి త్వరలో తండేల్ సినిమాతో( Thandel ) ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది.

"""/" / అలాగే రామాయణం సినిమాతో( Ramayan Movie ) బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది.

అయితే సినిమాల విషయంలో సాయి పల్లవి చాలా జాగ్రత్తగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

మంచి కథ అయితేనే నటించడానికి అంగీకరిస్తున్న సాయిపల్లవి ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ప్రతి వారికి నచ్చేవి, నచ్చని విషయాలు ఉండటం సహజం అని చెప్పింది.

కొన్ని భయాలు కూడా మనల్ని వెంటాడుతుంటాయని అంది.తనకు ఫొటోలు తీయడం అస్సలు నచ్చదని తెలిపింది.

బయటకు వెళ్లినప్పుడు కొందరు సడన్‌ గా సెల్‌ఫోన్‌ లో తనను ఫొటోలు తీస్తుంటారని, అలాంటివి తనకు నచ్చవని ఆమె చెప్పింది.

అలాంటప్పుడు తాను చెట్టునో, సుందరమైన భవనాన్నో కాదనీ, జీవం ఉన్న మనిషిని కథా అని అనిపిస్తుందని అన్నారు సాయి పల్లవి.

"""/" / మీమ్మల్ని ఒక్క ఫొటో తీసుకోవచ్చా? అని అడిగి తీసుకుంటే ఎంత భాగుంటుందీ, అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్ లేకుండా ఫోటోలు తీస్తుంటారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.

తన చుట్టూ చాలా మంచి ఉన్నప్పుడు లేదా అందరూ తననే చూస్తున్నప్పుడు కొంచెం భయంగానూ, కొంచెం బిడియంగానూ ఉంటుందని తెలిపింది.

అదేవిధంగా తనను అభినందించినా అలానే ఉంటుందని, వెంటనే ఒకటి, రెండు, మూడు అని అంకెలు లెక్క పెట్టుకుంటానని చెప్పింది.

అంతేకాకుండా హద్దులు మీరిన ఆలోచనలు చేస్తానని అంది.ఆ అలవాటును మానకోవడానికి నిత్యం ధ్యానం చేస్తున్నాననీ, ఇకపోతే తాను చాలా తక్కువ స్థాయిలో మేకప్‌ను వేసుకుని సాంప్రదాయ బద్ధంగా ఉండాలని ఆశిస్తానని నటి సాయిపల్లవి చెప్పుకొచ్చింది.

సందర్భంగా సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆ డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇవ్వబోతున్న చిరంజీవి.. ప్రూవ్ చేసుకోవడం పక్కా!