పీరియడ్స్ టైంలో షూటింగ్ అంటే సాయి పల్లవి అలాంటి పని చేస్తుందా?
TeluguStop.com
అమ్మాయిలకు నెల నెల పీరియడ్స్( Monthly Periods )రావడం సర్వసాధారణమే అయితే పీరియడ్స్ సమయంలో చాలామంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.
చాలామంది విపరీతమైనటువంటి నొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు.అయితే హీరోయిన్స్ మాత్రం పీరియడ్స్ ఉన్నప్పటికీ కూడా షూటింగ్ తప్పనిసరిగా చేయాల్సిందే.
వారు ఒక రోజు షూటింగ్ కి రాకపోతే నిర్మాతలు భారీ మొత్తంలో నష్టాలను భరించాల్సి ఉంటుంది.
అందుకే పీరియడ్స్ టైం లో కూడా సెలబ్రిటీలు షూటింగ్లో పాల్గొంటూ ఉంటారు. """/" /
అయితే పీరియడ్స్ సమయంలో షూటింగ్లో పడే ఇబ్బందుల గురించి ఇటీవల సాయి పల్లవి( Sai Pallavi ) చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సాయి పల్లవికి ఇదే ప్రశ్న ఎదురయింది.మీరు పీరియడ్స్ టైం లో షూటింగ్స్ ఎలా మేనేజ్ చేస్తారనే ప్రశ్న ఎదురైంది .
అయితే ఈ ప్రశ్నకు ఈమె ఎలాంటి సంకోచం లేకుండా చాలా ఓపెన్ గా సమాధానం చెప్పారు.
అఫ్కోర్స్ ఈ ప్రాబ్లం అందరికీ కామన్ ఖచ్చితంగా.ఫేస్ చేయాల్సిందే ఆ టైంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
"""/" /
సినిమా షూటింగ్ సమయంలో పీరియడ్స్ ఓకే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని తెలిపారు.
ఇక ఆ సమయంలో డాన్స్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితులలో నొప్పిని భరిస్తూ డాన్స్ చేయాల్సిందేనని ఈమె తెలిపారు.
తన విషయంలో ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయని తెలిపారు.తాను నటించిన శ్యామ్ సింగరాయ్ ( Shyam Singarai )సినిమాలో ఓ పాట చిత్రీకరణ సమయంలో తనకు పీరియడ్స్ వచ్చాయని కానీ ఆ సాంగ్ పూర్తి చేశామని ఈ సందర్భంగా సాయి పల్లవి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక ప్రస్తుతం సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే ఈమె కేవలం సౌత్ సినిమాలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు.
తెలుగులో నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ ( Thandel )సినిమాలో నటిస్తున్నారు.
వివాదంలో చిక్కుకున్న సింగర్ మధుప్రియ…. అరెస్టు చేయాలి అంటూ డిమాండ్?