పాపం... సాయి పల్లవిని అలా ఆడుకున్నారా!

తనదైన అందంతో, నటనతో ఆకట్టుకుంటూ పక్కింటి అమ్మాయిలా ఆకట్టుకుంటున్న సాయి పల్లవి తాజాగా ‘పడి పడి లేచే మనసు’ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా మాట్లాడుతూ తన గురించి తాను క్లారిటీ ఇచ్చింది.

గతంలో సాయి పల్లవి సెట్‌లో హీరోలతో, నిర్మాతలతో గొడవ పడుతుంది, అందరిని డామినేట్‌ చేయాలని చూస్తుంది అనే వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి.

దాంతో ఈ అమ్మడికి సోషల్‌ మీడియాలో కాంట్రవర్శీ క్వీన్‌ అంటూ పేరు పెట్టేశారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ తాజా ఇంటర్య్వూలో భాగంగా కాంట్రవర్శీ క్వీన్‌ అని ప్రశ్నించగా నేను ఎవరిని డామినేట్‌ చేయను, అలా ఎందుకు ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదు అని చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా శర్వా పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న కూడా సీనియర్‌ అని నన్ను జూనియర్‌లా అసలు చూడలేదు.

మా ఇద్దరి మద్య మంచి స్నేహం ఉంది, నా అనుభవాలే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చాయి.

నేను ఈ అనుభవాలను మర్చి పోవాలనుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చింది.శర్వా కూడా సాయి పల్లవి గురించి మాట్లాడుతూ ఆమెను పొగడ్తతో ముంచెత్తాడు.

మా ఇద్దరి మద్య మంచి స్నేహం ఉండడం వల్లనే రొమాంటిక్‌ సీన్‌లు అంతలా పండాయి.

తన కోపరేషన్‌ లేకుండా అలా వచ్చేవి కావు అంటూ సాయి పల్లవిని గురించి చెప్పుకొచ్చాడు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ గతంలో చాలా మంది హీరోలు సాయి పల్లవి గురించి కాంట్రవర్శీయల్‌గా చెప్పుకొచ్చారు.

శర్వా మాత్రం ఈ అమ్మడి గురించి చాలా బాగా చెప్పుకొచ్చాడు.సీనియర్‌ హీరో అయినా శర్వా డామినేషన్‌ చేయలేదు అంటే ఈ అమ్మడికి గతంలో అలాంటి అనుభవాలు ఎదురాయ్యయా? అనే సందేహాలు వస్తున్నాయి.

సాయి పల్లవిని జూనియర్‌గా చూసి ఆడుకోవాలని గత హీరోలు, నిర్మాతలు భావించారు కాబోలు.

అందుకే సాయి ప్లవి వారితో అలా గొడవ పడిరది.మొత్తానికి కొత్తగా వచ్చింది కదా అని ఈ అమ్మడిని ఆడుకోవాలని చూశారు అంటూ ఈమె అభిమానులు వాపోతున్నారు.