Sai Pallavi:సాయి పల్లవి ముందు నడిరోడ్డు మీద ఇంత పెద్ద సంఘటన జరిగిందా ?
TeluguStop.com
సాయి పల్లవి( Sai Pallavi ) చాల మంది హీరోయిన్స్ లాగ ఆటిట్యూడ్ చూపించడం లాంటివి చేయదు అని ప్రత్యేకముగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆమె చాల సాధారణ అమ్మాయి లాగ ప్రవర్తిస్తుంది.హీరోయిన్ అయితే నాకేం కొమ్ములు వచ్చాయా అంటూ నవ్వేస్తుంది.
రోడ్డు పైన నడుచుకుంటూ కూడా వెళ్ళిపోతుంది.కార్ ఉన్నా కూడా అవసరం లేకపోతే వాడదు.
ఒకసారి రోడ్ పైన జంక్షన్ వద్ద క్రాస్ చేయడం కోసం ఎదురు చూస్తుంది.
ఆమె పక్కనే ఒక ఫామిలీ కూడా రోడ్ క్రాస్ చేయడానికి నిలబడి ఉన్నారు.
వాళ్లలో ఒక 12 లేదా 13 ఏళ్ళ అమ్మాయి కూడా ఉంది.సిగ్నల్ పడగానే రోడ్ క్రాస్ చేస్తున్న అమ్మాయిని బైక్ పైన వచ్చిన ఒక వ్యక్తి స్పీడ్ గా తాకకూడని చోట తాకేసి ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతున్నాడు.
"""/" /
రెప్ప పాటు లో జరిగిన ఈ సంఘటన తో ఆ చిన్నారి మొదట ఏం జరుగుతుందో అర్ధం కాక కంగారు పడింది.
ఆ తర్వాత చాల భయపడింది.కానీ సాయి పల్లవి మాత్రం ఆ సంఘటనను చూస్తే త్వరగా స్పందించి ఆమె ఫోన్ లో బైక్ వ్యక్తిని ఫోటో తీసింది( He Took A Photo Of The Bike Guy On The Phone ).
వెంటనే పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించి ఆ కుర్రాడిని ఈవెంటీజింగ్ కేసు లో అరెస్ట్ చేయించింది.
ఈ సంఘటన చాల రోజుల క్రితం జరిగిన ఇప్పటికి ఆ బైక్ నడిపిన వాడి డ్రెస్ కలర్ తో సహా ఆ అమ్మాయి పడిన భయం అంత కూడా గుర్తు పెట్టుకుంది.
ఆ మధ్య ఒక సినిమా ప్రమోషన్ టైం లో ఈ విషయం చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.
రోడ్ పైన వెళ్లే అమ్మాయిలు ఎవరికి ప్రాపర్టీ కాదు.మనం చేసే పని లేదా మాట్లాడే మాటల వల్ల ఎవరు బాధ పడకుండా చూసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది.
"""/" /
ఆ రోజు ఆ అమ్మాయి ఇంకా పూర్తి స్థాయి మహిళా కూడా కాదు.
ఒక చిన్నారి.ఆమె ఆ క్షణాన ఎంత భయానికి గురి అయ్యి ఉంటుంది.
ఆ సంఘటన ఆ పాపను జీవితాంతం వేధిస్తుంది.అందుకే ప్రతి ఒక్కరు బయట వారిని అయినా ఇంట్లో వారిని అయినా మహిళలకు, అమ్మాయిలకు, చిన్న పాపాలకు కూడా గౌరవం ఇవ్వండి అంటూ సాయి పల్లవి చాల ఎమోషనల్( Sai Pallavi Is Very Emotional ) అయ్యింది.
ఇలాంటి సంఘటన మరొక అమ్మాయికి జరగకూడదని కోరుకుంది.
తమిళ్ ఇండస్ట్రీ ని పాన్ ఇండియాలో నిలిపే సత్తా ఆ స్టార్ హీరోకే ఉందా..?