అతని కోసం.. ఇష్టం లేకపోయినా కోడి కూర వండాను అంటున్న సాయి పల్లవి?

సాయి పల్లవి.ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ పేరు మార్మోగిపోతోంది అని చెప్పాలి.

అంతేకాదు ఇక ఈ అమ్మడికి అభిమానుల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతోంది.అబ్బా ఆ హీరోయిన్ ని ఎంత హాట్ గా ఉంది అని సినీ తారల గురించి అనుకునే వారు ఎంతో మంది ప్రేక్షకులు.

కానీ సాయిపల్లవిని చూసిన తర్వాత మాత్రం.హీరోయిన్ అంటే సాయి పల్లవిలా ఉండాలి అంటూ అనుకుంటున్నారు.

అంతలా తన సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.అందాల ఆరబోతతోనే కాదు అందమైన చిరునవ్వుతోనే ప్రేక్షకుల మనసు దోచేస్తుంది సాయి పల్లవి.

కోట్లు వస్తాయని తెలిసినా అందాల ఆరబోతకు దూరంగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలకు దగ్గరగా సినీ కెరీర్ లతో ముందుకు వెళుతుంది సాయి పల్లవి.

ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది అని చెప్పాలి.కాగా ప్రస్తుతం సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటించిన విరాట పర్వం సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవలే ప్రమోషన్స్ లో పలు విషయాలను అభిమానులతో పంచుకుంది సాయి పల్లవి.ఈ క్రమంలోనే ప్యూర్ వెజిటేరియన్ అయిన సాయి పల్లవి తన జీవితంలో మొదటిసారి ఒక వ్యక్తి కోసం చికెన్ వండాను అన్న విషయం చెప్పుకొచ్చింది.

"""/"/ నేను వెజిటేరియన్ కావడంతో కోడిని చంపి వండటం నాకు అస్సలు నచ్చదు.

కానీ అలా ఒకరికి చికెన్ వండి పెట్టడం నాకు ఎంతో సంతోషం అనిపించింది.

ఒక వ్యక్తి కోసం కోడి కూర వండి పెట్టాను అంటు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

అయితే ఆ వ్యక్తి ఎవరు అనే విషయం మాత్రం బయటపెట్టలేదు సాయి పల్లవి.

ఇక సాయి పల్లవి సమాధానంతో ఒక సరికొత్త లవ్ స్టోరీని తెరమీదికి తీసుకువస్తున్నారు నెటిజన్లు.

గతంలో సాయిపల్లవి ఎవరితోనో ప్రేమలో పడి ఉంటుందని అతని గురించి చెప్పి ఉంటుందని ప్రచారం చేయడం మొదలు పెట్టారు.

మరి ఏం జరిగింది అనేది మాత్రం ఎవరికీ తెలియదు.

Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable