తులసిదళం, కాష్మోర సినిమాల రేంజ్ లో ‘విరూపాక్ష’
TeluguStop.com
మెగా హీరో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) నటించిన విరూపాక్ష చిత్రం ఈనెల 21 తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హీరో తేజ్ తాజాగా మీడియా ముందుకు వచ్చాడు.
ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
"""/"/
ముఖ్యంగా ఈ సినిమా ఒక మంచి థ్రిల్లర్ చిత్రం అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
అంతే కాకుండా తెలుగు లో హర్రర్ కాన్సెప్ట్ సినిమా తో వచ్చిన అన్వేషణ, తులసిదళం, కాష్మోరా చిత్రాల స్థాయిలో మా చిత్రం ఉంటుందని కూడా పేర్కొన్నాడు.
తెలుగు లో హర్రర్ చిత్రాలు( Horror Movies ) అంటే వెంటనే గుర్తుకు వచ్చే ఈ సినిమాలతో విరూపాక్ష( Virupaksha ) చిత్రాన్ని పోల్చుతున్నాడు అంటే కచ్చితంగా భారీగానే ఈ సినిమా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
"""/"/
కార్తీక్ దండు( Karthik Dandu ) దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా పై ఉన్న నమ్మకం నేపథ్యంలో అన్ని ఏరియా లో కూడా మంచి బిజినెస్ చేసినట్లుగా తెలుస్తుంది.
యాక్సిడెంట్ తర్వాత తేజ్ నటించిన చిత్రం ఇదే అవడంతో అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మెగా హీరో సినిమా అవడం తో మెగా ఫ్యాన్స్( Mega Fans )లోనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.సాయి ధరమ్ తేజ్ కి జోడి గా ఈ సినిమాలో లక్కీ బ్యూటీ సంయుక్తా మీనన్( Samyukta Menon ) హీరోయిన్ గా నటించింది.
ఆ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నీ ఈ మధ్య హిట్ అవుతున్నాయి.కనుక ఈ సినిమా కూడా హిట్ అవుతుందని నమ్మకం వ్యక్తం అవుతుంది.
ఎలా ఉంటుందో చూడాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
రైతుబిడ్డ కాదు రాయల్ బిడ్డ.. పల్లవి ప్రశాంత్ మాటలకు చేతలకు పొంతన లేదుగా!