రేవంత్ రెడ్డి నుంచి ఆహ్వానం అందుకున్న సాయి ధరమ్ తేజ్…సన్మానం చేయబోతున్నారా..?
TeluguStop.com
రీసెంట్ గా పి హనుమంతు( P Hanumanthu ) అనే ఒక యూట్యూబర్ తన గ్యాంగ్ తో కలిసి ఒక చిన్న అమ్మాయి తన తండ్రి కి మధ్య ఉన్న ఒక వీడియోని అసభ్య పదజాలంతో మాట్లాడుతూ హేళన చేశారు.
ఇక దాంతో ఈ వీడియో సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అయింది.
ఇక ఈ విషయాన్ని హీరో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) తెలంగాణ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
ఇక ఇదిలా ఉంటే ఇకమీదట ఇలాంటివి జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
"""/" /
ఇలాంటి క్రమంలోనే తన సినిమాలను తను చేసుకుంటూనే సాయి ధరమ్ తేజ్ సమాజం పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని అలాంటి కొంతమందిని శిక్షించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు ఆయనని చాలామంది మెచ్చుకుంటున్నారు.
నిజానికి ప్రతి ఒక్కరికీ సమాజ స్పృహ ఉండాలి.సినిమా హీరోలకైతే ఇంకాస్త ఎక్కువగా ఉండాలి.
ఎందుకంటే వాళ్ల ఇన్ఫ్లుయెన్స్ తోనే చాలామంది సమాజంలో బతుకుతూ ఉంటారు.కాబట్టి వాళ్లు మంచిని చెప్పే ప్రయత్నం అయితే చేయాలి.
"""/" /
ఇక అలాగే సాయిధరమ్ తేజ్ ఈ సంఘటన మీద స్పందించడం వల్ల ఇప్పుడు వాళ్ళ మీద తగిన చర్యలను కూడా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక మొత్తానికైతే సాయి ధరమ్ తేజ్ రియల్ హీరోగా గుర్తింపు పొందుతున్నాడు.ఇక తను చేసిన పనికి తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) సాయి ధరమ్ తేజ్ ను తొందర్లోనే కలిసి ఆయనకి సన్మానం కూడా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సాయి ధరమ్ తేజ రెండు మూడు సినిమాలను సెట్స్ మీదికి తీసుకెళ్లాడు.
మరి ఈ సినిమాలను తొందరలోనే ఫినిష్ చేసి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం లో ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక సంపత్ నంది డైరెక్షన్ లో తను చేయాలనుకున్న గంజా శంకర్( Ganja Shankar ) సినిమా ఓవర్ బడ్జెట్ కారణంగా ఆగిపోయిందనే విషయం మనందరికీ తెలిసిందే.
మరి ఇక మీదట చేయబోయే సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ లు అందుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది.
హెచ్ 1 బీ వీసా విధానంపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు